టీడీపీ నేతలు వరుసగా అవినీతి, అక్రమాలు, కుంభకోణాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అచ్చన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి జైలు పాలయ్యారు. ఈ ముగ్గురు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అయితే ఈ అరెస్ట్ లు వెనుక వైకాపా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ కేసులు బనాయించి అధికారులు ప్రభుత్వం కొమ్ము కాస్తు అరెస్ట్ లకు తెగబడుతున్నారనీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జేసీ ట్రావెల్స్ పై ఎటాక్ తో దివాకర్ రెడ్డి ఇప్పటికే తన వాదనను వినిపించారు. జగన్ అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారని, ఇక జగన్ ప్రధాని మోదీ మాట తప్ప ఇంకెవరి మాట వినరని..తనకి జైలు తప్పదని చెప్పకనే చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి జేసీ తనదైన శైలిలో స్పందించారు. జగన్ దెబ్బకు తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయన్నారు. ఇక ఉన్న భూముల్లో వ్యవసాయం చేసుకుని బ్రతకడమే గత్యంతరమన్నారు. అయితే జగన్ ఎన్ని కేసులు పెట్టినా తాను బయపడనని..దైర్యంగా ఎదుర్కుంటానని ధీమా వ్యక్తం చేసారు. అయితే జేసీ అక్రమాలపై తాజాగా ఓ వ్యక్తి తెరపైకి వచ్చాడు. అనంతపురంలో తన భవాన్ని జేసీ ఆక్రమించినట్లు మల్లిఖార్జున్ అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. 2009 లో నుంచి భవనం లాక్కుని అందులో జేసీ ట్రావెల్స్ పెట్టి అద్దె చెల్లించకుండా, అడిగితే ఇవ్వనని..చంపేస్తానని బెదిరించినట్లు చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఎలాగైనా జేసీ ట్రావెల్స్ ని ఖాళీ చేయించి పోలీసులు, అధికారులు తన భవనాన్ని అప్పగించాలని కోరాడు. దీంతో జేసీ కొత్త చిక్కుల్లో పడ్డట్లు అయింది. ఇప్పటికే వైకాపా సర్కార్ అక్రమాలకు పాల్పడ్డ వారిపై కొరడా ఝుళిపించి ముందుకెళ్తోంది. అక్రమాలకు పాల్పడ్డ వారిని వందలకుండా క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చే కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తోంది. కాబట్టి జగన్ దివాకర్ పైనా కాన్సంట్రేట్ చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ నిపుణుల్లో చర్చనీయాంశంగా మారింది. జేసీ బ్రదర్స్ అక్రమంగా వాహనాల కొనుగోలు విషయంలో ఇప్పటికే చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే.