ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ అందుకున్న విజయాల్లో ‘జాతిరత్నాలు’ కూడ ఒకటి. సినిమా నిర్మాతలకి భారీ లాభాలను ఆర్జించి పెట్టింది. కేవలం వన్ లైనర్ కామెడీ పంచెస్ తప్ప ఇంకేమీ లేని ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సినిమా నిర్మాణం కోసం ఎంత ఖర్చు పెట్టారో దాంట్లో సగానికి పైగా ప్రమోషన్లకు ఖర్చు చేశారు. మొదటిరోజు నుండే సామాజిక మాధ్యమాల్లో చిత్రాన్ని హిట్ సూపర్ హట్ అంటూ ప్రచారం చేశారు. సినిమాకు వెళ్లే ప్రేక్షకుల్ని ముందే సినిమా బ్లాక్ బస్టర్ అనే మూడ్లోకి తీసుకెళ్లగలిగారు.
సినిమా చూసిన ప్రతిఒక్కరూ కథ, లాజిక్స్ లేవు కానీ సినిమా మాత్రం బాగుంది అన్నవారే. థియేటర్లలో ప్రతి మాటకు నవ్వులే నవ్వులు. సగానికి సగం మంది డైలమాలో సినిమా బాగుంది అనేశారు. అలా లెక్కలకు అందని రీతిలో విజయం సాధించింది సినిమా. ఇలా థియేటర్లలో హిట్ కొట్టిన ఆ చిత్రం ఓటీటీలో మాత్రం తేలిపోతోంది. ఇటీవలే సినిమా ఓటీటీ ద్వారా విడుదలైంది. కాసేపు సినిమా చూసిన చాలామంది ఇదెలా హిట్ అయింది అంటున్నారు. పూర్తిగా చూడకుండానే మొబైల్ కట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇన్నాళ్లు థియేటర్లలో పోయిన సినిమాలు ఓటీటీల్లో మెప్పించడం చూశాం కానీ థియేటర్లలో హిట్ అయి ఓటీటీల్లో నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంటున్న మొదటి సినిమా ఇదే. ఎంతైనా ‘జాతిరత్నాలు’ కదా. లెక్కలకు అందదేమోలెండి.