సాధారణం అమ్మాయిలు అయినా సెలబ్రిటీలు అయిన ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి. ముఖ్యంగా తమకు కాబోయే వాడు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతి ఒక్క అమ్మాయి ఎన్నో కలలు కంటుంది.తన ఇష్టాలకు అనుగుణంగా ఉన్నవాడు తన జీవిత భాగస్వామిగా వస్తే తన జీవితం ఎంతో బాగుంటుందని సంబరపడతారు. అయితే ఈ విషయంలో సెలబ్రిటీలు సైతం తమకు కాబోయే వాడు ఎలా ఉండాలో కలలు కంటూ ఉంటారు. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తన టాలెంట్ తో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె సినిమాలతో కన్నా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారని చెప్పాలి. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేసే జాన్వీ కపూర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పేసింది.
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ.. తాను చేసే ప్రతి ఒక్క పనులను ఇష్టపడే టాలెంటెడ్ వ్యక్తి నాకు భర్తగా రావాలి.ముఖ్యంగా సెన్సాఫ్ హ్యూమర్ కలిగి ఉండి నిత్యం ఏదో ఒకటి చెబుతూ నన్ను నవ్వించడమే కాకుండా కొత్తగా తనకు ఏదో ఒకటి నేర్పించే వ్యక్తి భర్తగా రావాలని తెలిపారు. నన్ను ఉత్సాహంగా ఉంచే వాడు నాతో కలిసి పోయేవాడు ముఖ్యంగా నేనంటే పడి చచ్చిపోయేవాడు తనకు భర్తగా రావాలని ఈ ముద్దుగుమ్మ తన కాబోయే వాడి గురించి ఎన్నో కలలు కన్నారు.మరి ఈమెకు కాబోయే వాడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఈమె మాత్రం కాబోయే భర్త గురించి కోరికలు భారీగానే ఉన్నాయని చెప్పాలి.