Jr.NTR: #NTR 31లో జాన్వీ కపూర్…. అసలు విషయం బయట పెట్టిన బోనీకపూర్!

Jr.NTR: అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వనుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ జనగణమన సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తుందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఎన్టీఆర్ 31 వ చిత్రంలో కూడా ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ వార్తలపై ఈ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేసింది.ఈ క్రమంలోనే ఎంతోమంది శ్రీదేవి అభిమానులు తన కూతురు తెలుగు తెరపై సందడి చేయబోతుంది అనే విషయం తెలియడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు అయితే ఈ విషయంపై తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బోనికపూర్ నిన్న హైదరాబాద్ లో జరిగిన వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోణీ కపూర్ మాట్లాడుతూ అసలు విషయం వెల్లడించారు.

ఈ సందర్భంగా బోనీకపూర్ మాట్లాడుతూ…జాన్వీ ఆమె తల్లి శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తుందని మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ ఉంటే తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. అయితేఎన్టీఆర్ 31వ సినిమా పై వస్తున్న వార్తల గురించి ఆయన స్పందిస్తూ ఇప్పటివరకు ఈ సినిమాలు జాన్వికపూర్ నటించాలని తననెవరూ కలవలేదనిఆయన జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాను ఫాలో అయితే తప్పకుండా వాళ్లు పిచ్చోళ్ళు కావడం ఖాయమని ఈ సందర్భంగా బోనికపూర్ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి అసలు విషయం బయట పెట్టారు.