ప్రశ్నించేందుకు వచ్చిన గొంతు ఇప్పుడేమైంది పవనా ?

Janasena

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. నేను అధికారం కోసం కాదు ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చాను అంటూ ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అయన గొంతు ప్రశ్నించడానికి లేస్తుంది. దీనితో కొందరు ప్రశ్నించడం తప్ప మిగతా అన్ని రాజకీయపరమైన పనులు చేస్తున్నాడు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రవేటీకరణ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నాడు. ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో బీజేపీతో పాటు దాని మిత్ర ప‌క్ష‌మైన జ‌న‌సేన కూడా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

pawan kalyan janasena

బీజేపీతో జ‌న‌సేన పొత్తు కుదుర్చుకోవ‌డం వ‌ల్ల క‌లిగిన ప్ర‌యోజ‌నాల సంగ‌తేమో గానీ, అడుగ‌డుగునా జ‌న‌సేన జ‌నంలో అభాసుపాలు అవుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఒక్క విషయమే కాకుండా మొన్నటికి మొన్న కేంద్రం తీసుకోని వచ్చిన రైతుల కొత్త చట్టాలపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగిన కానీ, ఆ విషయంలో జనసేన ఏమి మాట్లాడలేదు. అన్యాయం జరిగితే ప్రశించటానికి వచ్చాను అని చెప్పుకునే జనసేనాని, ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతున్న ఏమి మాట్లాడకుండా మొఖానికి రంగేసుకొని సినిమాలు చేస్తున్నాడు.

విశాఖ ఉక్కు విషయంలో ఆంధ్ర రాష్ట్రము మొత్తం బంద్ జరిగింది. దీనికి అధికారంలో ఉన్న వైసీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మిగిలిన పార్టీలు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొన్నాయి. బీజేపీ, జనసేన మాత్రమే ఈ బంద్ కు దూరంగా ఉన్నాయి. బీజేపీ తో బంధం ఉండటం వలనే పవన్ కళ్యాణ్ ఈ బంద్ కు దూరంగా ఉండవలసి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల సెంటిమెంట్‌కి సంబంధించిన వ్య‌వ‌హారం. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ నినాదంతో చేప‌ట్టిన రాష్ట్ర బంద్‌లో పాల్గొన‌ని బీజేపీ, జ‌న‌సేన‌ల‌పై స‌హ‌జంగానే రాష్ట్ర ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. ఆంధ్ర విషయంలో బీజేపీ శీతకన్ను వేస్తుంది అనే అభిప్రాయం ఆంధ్రులకు ఉంది. తాజాగా జరుగుతున్నా పరిణామాలు వాటికీ మరింత బలం చేకూర్చే విధంగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా జనసేన మీద పడుతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఆ విషయంలో ఇంకోసారి ఆలోచించుకోవాలి.