కొత్త తరమైన రాజకీయాలకు నాంది పలకడానికి పార్టీని స్థాపించానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు పొత్తుల వల్ల రాజకీయ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఇప్పటికే 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి దాని వల్ల వచ్చిన చెడ్డ పేరును ఇంకా పవన్ భరిస్తున్నారు. ఇంకా జనసేనను ఇతర పార్టీ నాయకులు టీడీపీకి చెందిన పార్టీగానే చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘోరమైన అపజయాన్ని పొందిన జనసేన, ఇప్పుడుడ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని రాజకీయంగా ఎదగాలని అనుకుంటుంది.
అయితే ఇప్పుడు బీజేపీ నుండి జనసేనకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల పక్షాన నిలబడటానికి పవన్ ఒక్క నిమిష కూడా ఆలోచించరు కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉండటం వల్ల ప్రతి విషయంలో బీజేపీ యొక్క అనుమతి తీసుకోవలసి వస్తుంది. పవన్ తన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పిన పవన్ మళ్ళీ నెక్స్ట్ డే మీడియా ముందుకు వచ్చి తాము పోటీ చెయ్యడం లేదు బీజేపీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ నిర్ణయం వెనక కూడా బీజేపీ ఒత్తిడి ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా జనసేనకు అన్యాయం జరిగిందని తెలుస్తుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం త్యాగం చేశాం కాబట్టి తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తమకు మద్దతు ఇస్తుందని జనసేన నాయకులు అనుకున్నారు కానీ అక్కడ జనసేనకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుపతిలో కూడా బీజేపీ అభ్యర్థినే నిలబెట్టడానికి రంగం సిద్ధమైందని తెలుస్తుంది. తిరుపతి ఉప ఎన్నిక విషయమై పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపినప్పటికి జనసేనకు అనుకూలంగా సమాధానాలు రాలేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇలా పొత్తులు పెట్టుకున్న ప్రతిసారి జనసేన ఊహించని, ఎప్పటికి మర్చిపోలేని ఇబ్బందులు వస్తున్నాయి. టీడీపీ మిగిల్చిన మచ్చ ఇంకా పూర్తిగా తొలగక ముందే బీజేపీ ఇబ్బందులు పెడుతుంది. ఎంతో బలమైన నిర్ణయాలు, సిద్ధాంతాలు కలిగిన పవన్ కు వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకునే అవసరం ఉందా అంటే లేదనే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.