2019 లో జనసేన పార్టీకి ఊహించని పరాజయం ఎదురుకావడం, దానికి తోడు పోటీ చేసిన రెండు చోట్ల ఘోర ఓటమి చెందటంతో పవన్ కళ్యాణ్ రాజకీయా జీవితంలో విచిత్రమైన మార్పులు జరిగాయి. అంతకు ముందే టీడీపీ తో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, దాని కంటే ముందే బీజేపీ కి బ్రేక్ అప్ చెప్పేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటంతో మళ్ళీ ఎలాగోలా బీజేపీ తో జతకట్టి రాజకీయా ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. బీజేపీకి కూడా ఎవరో ఒకరు తోడు ఉండాలి కాబట్టి జనసేన తో పొత్తుకు ఒప్పుకుంది.
అయితే అది మూణ్ణాళ్ళ ముచ్చటగా మిగిలిపోయేలా ఉంది. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయమని తెలుస్తుంది. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికలను బీజేపీ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోని పోటీచేస్తుంది. పైగా గెలుపు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, దీనితో ఇంకొంచం కష్టపడితే గెలవచ్చనే ధీమా బీజేపీలో కనిపిస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ప్రచారానికి వస్తే అది మరింత ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది . అందుకే పవన్ ను ప్రచారానికి తీసుకోని రావాలని అనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదని తెలుస్తుంది. దీనితో బీజేపీ ఈ విషయంలో సైలెంట్ అయ్యింది, కానీ దాని ప్రభావం ఆంధ్రాలో కనిపిస్తుంది.
తాజాగా విజయవాడ లో బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన నుండి ఏ స్థాయి నాయకుడు కూడా వచ్చిన దాఖలాలు లేవు. రాలేదనే దానికంటే బీజేపీ నుండి ఎలాంటి పిలుపులు పోలేదని చెప్పుకోవాలి. మొన్న వరద బాధితులను పరామర్శించే విషయంలో కూడా రెండు జెండాలు కలిసిన దాఖలాలు లేవు. దీనిని బట్టి బీజేపీ -జనసేన మధ్య గ్యాప్ ఉన్నమాట వాస్తవమే అని తెలుస్తుంది. మరోపక్క బీజేపీ మరియు వైసీపీ రెండు కలవబోతున్నాయనే మాటలు కూడా వినిపించటంతో జనసేన కూడా బీజేపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారేమో అనే అనుమానాలు వస్తున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు కానీ ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ జనసేన మధ్య మొగుడు పెళ్ళాం తగాదాలు జరుగుతున్నాయనేది వాస్తవం, వాటిని కూర్చొని పరిష్కరించుకుంటారో లేక విడాకులు తీసుకుంటారో చూడాలి… విడాకులు తీసుకోవటం పవన్ కళ్యాణ్ కి కొత్తేమి కాదులే…రాజకీయంగా