జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వార్తలో నిలుస్తున్నారు. త్వరలో ఏపీలో తిరుపతి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే తన మిత్రపక్షం బీజేపీని వదిలేసి ఆయన ఒంటరిగా ఏపీలో పర్యటిస్తున్నారు. నివర్ తుఫాను వచ్చినప్పుడు కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఒంటరిగా పర్యటించిన పవన్.. తాజాగా కృష్ణా జిల్లాలోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
శతకోటి లింగాల్లో వీళ్లు బోడి లింగాలు అని.. గుడివాడ, మచిలీపట్నంలో పర్యటించిన సమయంలో పవన్ వ్యాఖ్యానించారు. వీళ్లిద్దరు ఎక్కువగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని తెలుసుకొని.. వాళ్లపై విమర్శల యుద్ధం చేశారు పవన్.
వాళ్లపై ఫైర్ అయ్యేసరికి.. వాళ్లు కూడా కౌంటర్ ఇచారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు. భీమవరం, గాజువాక ప్రజలను అడిగితే బోడి లింగాలు ఎవరో తెలుస్తుందని ఇద్దరు నానీలు పవన్ కు కౌంటర్ అటాక్ ఇచ్చారు.
పవన్ వకీల్ సాబ్ కాదు.. షకీలా సాబ్.. మెడ మీద ఉన్న మట్టిని నలుపుకునే వ్యక్తి.. అంటూ పవన్ సినిమాలను ఉద్దేశించి పేర్ని నాని విమర్శించారు.
ఈ ఇష్యూ కాస్త.. వైసీపీ, జనసేన శ్రేణుల మధ్య కౌంటర్లు ఇచ్చుకునే స్థాయి వరకు వెళ్లింది. వైసీపీ నేతలు పవన్ పై చేస్తున్న విమర్శలకు జనసేన కార్యకర్తలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. తప్పు ఎవరు చేసినా సరే.. తమ అధినేత పవన్ విమర్శిస్తారని.. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబును కూడా విమర్శించారంటూ వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.