Janasena: పార్టీ లైన్ దాట్టొద్దు… చర్యలు తప్పవు.. జనసేన నేతలకు పవన్ వార్నింగ్!

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తన పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు ఎంపీల గురించి మాట్లాడుతూ వారికి కొన్ని సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని అలా కాకుండా పార్టీకి నష్టం చేకూరేలా పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తప్పవు అంటూ పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జనసేన నేతలకు పవన్ అధికారకంగా వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ విడుదల చేశారు.

పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్ పెట్టి ఈ లేఖను సోషల్ మీడియాలో జనసేన పార్టీ పోస్ట్ చేసింది. పార్టీలోని కొంతమంది నేతలు.. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ దాటుతున్నారని జనసేన అందులో పేర్కొంది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.జనసేన పాలసీపైనా, జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారానికై చేస్తున్న కృషి, జనసేన పార్టీ వ్యూహాల గురించి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలు, సమావేశాలలో ఎప్పటి కప్పుడు తెలియజేస్తూనే ఉన్నారని జనసేన లేఖలో పేర్కొంది.

ఇలా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వ్యూహాల గురించి మాట్లాడుతున్న కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ మాటలను లెక్కచేయకుండా వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి తరుణంలోనే పార్టీ నియమాలకు కట్టుబడి ఉండకుండా లైన్ దాటితే మాత్రం చర్యలు తప్పవు అంటూ హెచ్చరిస్తూ ఈ లెటర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.