Janasena: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం… నోరూరించే ఫుడ్ మెనూ… లిస్ట్ ఇదిగో!

Janasena: మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ వేడుకను నేడు పిఠాపురంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ స్పీచ్ పై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా సుమారు 5 లక్షల మంది వరకు కార్యకర్తలు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. అయితే అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొనబోతున్న అభిమానులకు పలు రకాల ఆహార పదార్థాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ పెట్టబోతున్న ఫుడ్ మెనూకి సంబంధించిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అభిమానులకు వెజ్, నాన్ వెజ్ వంటకాలను గోదావరి వంటకాల స్టైల్లో తయారు చేయించినట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులకు గోదావరి వంటకాలు రుచి చూపించనున్నారు.

ఈ సందర్భంగా సభకు వచ్చిన ప్రతీ ఒక్క కార్యకర్త తృప్తిగా భుజించేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా… కోడి వేపుడు, మటన్ బిర్యానీ, చేపల పులుసు, పీతల పులుసు, రొయ్యల ఇగురు వంటి వంటకాలతో పాటు స్టార్టర్స్ తో నాన్ వెజ్ ఏర్పాట్లు చేశారు అయితే వెజ్ ప్రియులకు కూడా అదిరిపోయే వంటకాలను పెడుతున్నారని తెలుస్తోంది.పప్పు, ఆవకాయ, సాంబారు, రోటి పచ్చడి, రసం, మజ్జిక చారు, గ్రేవీ కర్రీతో పాటు గడ్డ పెరుగును కార్యకర్తలకు అందించనున్నారు. ఇక ఈ వేసవిలో కార్యకర్తల దాహార్తిని దృష్టిలో ఉంచుకుని.. మంచినీళ్లు, మజ్జిగ, పలు రకాల పండ్ల ముక్కలు కార్యకర్తలకు నిరంతరం అందచేస్తున్నారు.

జనసేన పార్టీ స్థాపించి నేటికి సరిగ్గా 12 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ 12 సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ అలాగే అధినేత పవన్ కళ్యాణ్ కూడా మొదటిసారి ఎమ్మెల్యే కావడం డిప్యూటీ సీఎం కావడంతో ఈ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.