AP: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు… కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్!

AP: ఇటీవల ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో వాటి భర్తీకి నోటిఫికేషన్ వెలబడిన నేపథ్యంలో ఎవరిని ఎమ్మెల్సీలుగా ప్రకటించనున్నారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది అయితే జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు ఎంపిక అవుతారంటూ వార్తలు వినిపించాయి. తాజాగా జనసేన నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేస్తూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేశారు.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేయాలి అంటూ సమాచారం ఇచ్చారు అంతేకాకుండా నామినేషన్ దాఖలు చేయడం కోసం అవసరమయ్యే పత్రాలన్నింటినీ కూడా సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు ఏ పదవి ఇవ్వబోతున్నారు అనే విషయంపై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొని ఉండేది.

ఈయన మొదట్లో టిటిడి చైర్మన్గా కొనసాగుతారని వార్తలు వచ్చాయి అనంతరం పెద్దల సభకు వెళ్తారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ కాదని ఆయనని ఏపీ క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడటంతో జనసేన పార్టీ నుంచి నాగబాబును ఎంపిక చేశారు.

ఇలా ఎమ్మెల్సీగా ఈయనని ఎన్నుకొని అనంతరం ఏపీ క్యాబినెట్లో నాగబాబుకు చోటు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈయనకు ఏపీ క్యాబినెట్లో ఏ శాఖ తనకు కేటాయించబోతున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అవడంతో ఉగాది పండుగలోపు నాగబాబు ఏపీ క్యాబినెట్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.