జనసేన ఒక ‘జలగ’.. పట్టుకుంటే ‘వదలదు’

జనసేన ఒక 'జలగ'.. పట్టుకుంటే 'వదలదు'
జనసేన పార్టీ ‘జలగ’ లాంటిది.  ఆ జలగ పట్టుకునేది సమస్యల్ని.  ఒక సమస్యను పట్టుకుంటే దాన్ని తేచ్చే వరకు వదిలిపెట్టరు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు.  ఇప్పటికే పలు ప్రజాసమస్యల మీద అన్యాయాల మీద గళం విప్పి వాటికి పరిష్కారాలు సాధించడంలో విజయం సాధించిన జనసేన చాన్నాళ్లుగా పోరాడుతున్న అంశం ‘సుగాలి ప్రీతి’ అంశం.  మూడేళ్ల క్రితం సుగాలి ప్రీతి చదువుతున్న చోటే అనుమానాస్పద స్థితిలో మరణించింది.  మొదట్లో దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినా ఆ తర్వాత అది హత్యని, అత్యాచారం చేసి ఆ తర్వాత చంపారని తేలింది.  ఇదంతా చేసింది ప్రీతి చదువుతున్న విద్యా సంస్థల యాజమాన్యమేననే అనుమానాలు బలపడ్డాయి.  ప్రీతి తల్లి కూడ వాళ్లే చేశారని ఆరోపించారు. 
జనసేన ఒక 'జలగ'.. పట్టుకుంటే 'వదలదు'
 
కానీ నిందితులకు రాజకీయ నాయకుల మద్దతు ఉండటంతో ఆ తల్లి బాధను పట్టించుకునేవారు కరువయ్యారు.  దీంతో ఆమె నేరుగా పవన్ వద్దకు వెళ్ళి బాధను చెప్పుకుని తన బిడ్డకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.  ప్రీతి తల్లికి మాటిచ్చిన పవన్ ఇప్పటికీ సమస్య మీద పోరాటం చేస్తూనే ఉన్నారు.  జనసైనికులు అయితే విషయాన్ని మర్చిపోకుండా తరచూ ప్రస్తావనకు తెస్తూనే ఉన్నారు.  విషయం తెలియగానే పవన్ కేసును సీబీఐ చేతికి అప్పగించాలని లేకుంటే ర్యాలీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.  రేపు పవన్ ర్యాలీ అనగా ఈరోజు కేసును సీబీఐకి అప్పగిస్తునట్టు ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. 
 
కానీ ఆ తర్వాత మళ్లీ అలసత్వం.  సీబీఐ టేకప్ చేసినా ఇప్పటికీ నిందితులు ఎవరో తేలలేదు.  కనీసం కేసు పురోగతి ఏమిటో బయటకురాలేదు.  సరే.. విచారణ వివరాలు గోప్యం అనుకున్నా కనీసం బాధితురాలి తల్లికి కూడా కేసు ఎటు పోతోంది, ఎంతవరకు వచ్చింది తెలియక పోవడాన్ని బట్టి పురోగతి శూన్యమని తేలింది.  దీంతో జనసైనికులు మరోసారి సమస్యను వెలుగులోకి తేవాలి అనుకున్నారు.  అందుకే నిన్న మొత్తం సోషల్ మీడియాలో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు.  బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లక్షల్లో ట్వీట్లు పడ్డాయి.  దీంతో పోలీసులు స్పందించారు.  కానీ రివర్స్ లో.  ట్విట్టర్లో ట్వీట్లు వేసిన జనసేన నాయకులు, కార్యకర్తలను అర్థరాత్రి ఇళ్లకు వెళ్లి మరీ హెచ్చరించారు.  దీంతో విషయం ఇంకాస్త పెద్దదైంది.  జనసైనికులు సమస్య తేలేవరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకున్నారు.