Kiran Royal: జనసేన అధినేత కిరణ్ రాయల్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఈయన జనసేన నాయకుడిగా ఎంతో చురుగ్గా ఉంటూ వైసీపీ పై ఎప్పటికప్పుడు తనదైన శైలిలోనే సమాధానం చెబుతూ ఉండేవారు. ఇక ఈయన తిరుపతి ఇన్చార్జిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అంత సవ్యంగా సాగిపోతుంది అనుకున్న నేపథ్యంలో లక్ష్మీ రెడ్డి అనే మహిళ కిరణ్ రాయల్ గురించి సంచలన వీడియో బయట పెట్టారు.
కిరణ్ రాయల్ తనని మోసం చేశారని నా నుంచి కోటి రూపాయలు డబ్బు తీసుకొని ఇప్పుడు ఇవ్వడం లేదు అంటూ వీరిద్దరి వ్యక్తిగత వీడియోని ఒకటి షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త తీవ్రదుమారం రేపింది. ఇక ఈ వీడియోతో పాటు మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి రావడంతో వీరి వ్యవహారం సంచలనంగా మారింది.. ఇలా కిరణ్ రాయల్ వివాదంలో చిక్కుకోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ గురించి నిజా నిజాలు బయటకు తెలిసే వరకు ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు.
ఈ విధంగా కిరణ్ రాయల్ వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే లక్ష్మీరెడ్డి తో ఈయన రాజీకి వచ్చినట్లు తెలిపారు. ఇలా మా మధ్య రాజీ కుదిరింది అంటూ వీరిద్దరూ కూడా సమస్యను పరిష్కరించుకున్నారు ఇలాంటి తరుణంలోనే కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలనుకున్నారో అన్ని రకాలుగా టార్చర్ పెట్టారు. జగన్ మోహన్ రెడ్డిని చిట్టి రెడ్డి అని 2.0 అని పోస్ట్‌లు పెట్టిన దగ్గర నుండి నన్ను మానసికంగా చంపేశారు. అయితే అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పు చేయలేదని సపోర్ట్ చేశారని తెలిపారు. నా విషయం బయటకు రాగానే పవన్ కళ్యాణ్ నన్ను సస్పెండ్ చేయకుండా నిజా నిజాలు బయటకు రావాలని తెలిపారు.నన్ను నమ్మారు. పవన్ కళ్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటా,నేను ఏ తప్పు చేయలేదని పవన్ కళ్యాణ్‌కి తెలిసి విచారణ జరగాలంటూ ఆదేశించారని కిరణ్ రాయల్ పవన్ గురించి మాట్లాడుతూ కృతజ్ఞతను చాటుకున్నారు.
