Y.S.Jagan: వైయస్ కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తన తండ్రి సంపాదించిన ఆస్తులలో తనకు వాటా ఉంది అంటూ షర్మిల తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా సరస్వతి పవర్ భూములకు సంబంధించి వీరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వివాదం తాజాగా కోర్టు స్థాయికి చేరుకోవడంతో, జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ లో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో స్థాపితమైన సరస్వతి పవర్ & ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో భాగస్వామ్య వాటాల గురించి ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. జగన్ వివరణ ప్రకారం, తనపై వివిధ కోర్టు కేసుల నేపథ్యంలో, కొన్ని వాటాలను తన తల్లి విజయమ్మ పేరుమీద జగన్ ఆస్తులను రాశారు. ఇలా జగన్ సంపాదించిన ఆస్తులను కోర్టు కేసులు కారణంగా తన తల్లి పేరు మీద రాయడంతో తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తులను గిఫ్ట్ డీడ్ రూపంలో తన పేరు మీదకు రాయించుకోవాలనే ఆలోచనలో షర్మిల ఉందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక జగన్ అభిప్రాయం మేరకు సరస్వతి భూములకు సంబంధించిన విషయంలో షర్మిల వాటా ఏమాత్రం లేదు అలాగే ఆమె పెట్టుబడి కూడా రూపాయి పెట్టలేదు అయినప్పటికీ, తల్లి విజయమ్మను ముందుకు ఉంచి తన ప్రయోజనాలను ముందుకు నెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. ఇలా షర్మిల అత్యాశ కారణంగానే తన ఆస్తులను తన తల్లి పేరు పైకి రాయించగా వాటిని గిఫ్ట్ డీడ్ రూపంలో షర్మిల పొందాలని చూస్తున్నారంటూ జగన్ తన చెల్లిపై విమర్శలు కురిపించారు.