జగనన్న విద్యా దీవెన.. ప్రకటనల ఖర్చు అలా ఉపయోగించొచ్చేమో.!

Jaganna Vidya Deevena, Many Questions About Publicity

Jaganna Vidya Deevena, Many Questions About Publicity

కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక స్థితిగతులే కాదు, దేశ ఆర్థిక స్థితి, రాష్ట్రాల ఆర్థిక స్థితి దెబ్బతిన్న వైనాన్ని చూస్తున్నాం. ‘ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రకటనల కోసం వెచ్చించే ఆ కొద్ది మొత్తాన్నయినాసరే, ప్రజలకు అందేలా చేయగలిగతే మంచిది కదా..’ అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అన్నిట్లోనూ రివర్స్ టెండరింగ్.. అంటోన్న వైఎస్ జగన్ ప్రభుత్వం, మీడియాకి ప్రకటనలు ఇచ్చే క్రమంలో, ‘ప్రజలకు అదనంగా మేలు చేయగలం’ అన్న కోణంలో ఎందుకు ‘పొదుపు’ మార్గాన్ని ఎంచుకోలేకపోతోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. తాజాగా జగనన్న విద్యా దీవెన.. పేరుతో ఫీజు రీ-ఎంబర్స్మెంట్ నిధధుల్ని తల్లుల ఖాతాలో ఆన్ లైన్ విధానం ద్వారా జమ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజానికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెరపైకి వచ్చిన పథకమిది. సంక్షేమ పథకాల శఖంలో ఫీజు రీ-ఎంబర్స్మెంట్ అనేది ఓ సంచలనం.

చంద్రబాబు హయాంలో కూడా ఈ పథకం కొనసాగింది. దానికి వైఎస్ జగన్ హయాంలో జగనన్న విద్యా దీవెన అనే పేరు పెట్టారు. గత ప్రభుత్వాలెప్పుడూ ఇలా ఈ పథకం కోసం ఇంతలా ప్రకటనలు గుప్పించిన దాఖలాల్లేవు. ఈ రోజుల్లో పత్రికా ప్రకటనలంటే మాటలు కాదు. బోల్డంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరెందుకు ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పించినట్లు.? కరోనా కష్ట కాలంలో కూడా విద్యార్థులకు చదువుల పరంగా ఇబ్బంది రాకూడదని, జగన్ సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే. గత బకాయిలు చెల్లించడం ద్వారా జగన్ సర్కార్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. కానీ, ఈ గొప్ప అంతా.. ఇలా ప్రకటనల కారణంగా బూడిద పాలవడం బాధాకరమన్న చ్చ వైసీపీ శ్రేణుల్లో కూడా జరుగుతోంది.