వామ్మో జగన్ మామూలోడు కాడు .. అమిత్ షా భలే లాక్ చేశాడు

amith shah jagan

 ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు, అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా ను ఆయన నివాసంలో కలిసిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల మీద చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కు రావాల్సిన నిధులు,అదే విధంగా మూడు రాజధానుల విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

amith shah jagan

 ప్రధానంగా మూడు రాజధానుల విషయంలో జగన్ వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ప్రశంసలు లభిస్తున్నాయి. తెలిసిన సమాచారం ప్రకారం కర్నూలుని న్యాయ రాజధాని చేసే విధంగా, అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసేందుకు బీజేపీ గతంలోనే నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని పొందుపరిచిందని గుర్తు చేశారు జగన్. ఇప్పుడు అదే అంశాన్ని తాము అమలులోకి తెచ్చామని, మూడు రాజధానులు ఏర్పాటు చేశామని వివరించారు.

 పాలనా వికేంద్రీకరణ, ఏపీ సమగ్ర అభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించే ప్రణాళిక రూపొందించినట్టు అమిత్ షా కి తెలిపారు సీఎం జగన్. హైకోర్టుని కర్నూలుకి తరలించే ప్రక్రియ ఆరంభించాలని, దీని కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయనను కోరారు. దీనితో కర్నూల్ లో హైకోర్టు విషయం బీజేపీ కోర్టు లోకి వెళ్ళింది. అదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడాల్సిన బాధ్యత కూడా బీజేపీకి ఉంది.

ap high court

 నిజానికి మూడు రాజధానుల విషయంలో ఎప్పుడో క్లారిటీ రావాల్సింది, కానీ కొన్ని అనుకోని సంఘటనల వలన ఆలస్యం అవుతుంది. గతంలోనే కేంద్రం కూడా మూడు రాజధానుల విషయం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని సుప్రీంకోర్టు లో తేల్చి చెప్పింది. అయితే తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతు అమరావతికే కట్టుబడి ఉంటామని, మూడు రాజధానులు వద్దు మోడీ ప్రతినిధిగా ఈమాట చెబుతున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి.

 ఇలాంటి సమయంలో ఢిల్లీ వెళ్లిన జగన్, చాలా తెలివిగా ముందుగా హైకోర్టు విషయాన్నీ కదిలించి, ఆ బాధ్యత కేంద్రానిదే అంటూ మెలిక పెట్టాడు, దీనితో మూడు రాజధానుల విషయంలో మరోసారి కదలిక వచ్చినట్లు అయ్యింది. అయితే జగన ఎంతో తెలివిగా హైకోర్టు తరలింపు గురించి గతంలో బీజేపీ కూడా ఒప్పుకుంటుంది, కాబట్టి అందుకు సపోర్ట్ ఇవ్వాలని అమిత్ షా కోరాడు, కానీ అందుకు ఒప్పుకొని అమిత్ షా తరలింపు విషయంలో నోటిఫికేషన్ ఇస్తాడా..? లేక మేనిఫెస్టో తో సంబంధం లేదని ఊరుకుంటాడా అనేది చూడాలి.