గత రెండు రోజుల నుండి విశాఖ వైసీపీలో చిన్న చిన్న ప్రకంపనలు మొదలైయ్యి , ఏకంగా సీఎం జగన్ ఇన్వాల్ అయ్యేదాకా వెళ్లినట్లు తెలుస్తుంది. విశాఖపట్నం జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశంలో ఎంఎల్ఏలు, ఎంపి మధ్య వాగ్వాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. భూమి లావాదేవీల విషయంలో చోడవరం ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీ-రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి పెద్ద వాగ్వాదమే జరిగింది.
జిల్లాలోని అధికారులు, టీడీపీ ఎంఎల్ఏల మందు వీళ్ళద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. అయితే ఇద్దరిలో ఎవరు కూడా మరొకరి పేరు ఎత్తకుండానే వాదులాడుకున్నారు. ఈ సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కొందరు రాజకీయనేతలు భూములు ఆక్రమిస్తున్నారంటూ ఎంపి పదే పదే వ్యాఖలు చేశారు. దాంతో ధర్మశ్రీ మాట్లాడుతు రాజకీయనేతలు అంటూ అందరినీ ఒకే గాటన కట్టవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా భూములు ఆక్రమించుకుని ఉంటే నేరుగా వాళ్ళ పేర్లు చెప్పాలంటూ ఎంఎల్ఏ డిమాండ్ చేశారు.
ఒకరిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతూ అందరినీ అవమానించేట్లుగా మాట్లాడటం తగదంటు ధర్మశ్రీ ఎంపిని తీవ్రంగా ఆక్షేపించారు. ఆ తర్వాత ఈ భూముల వివాదంపైనే మరో ఎమ్మెల్యే అమరనాథ్ కు విజయసాయి కి మధ్య కూడా చిన్నపాటి వివాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ గొడవ విషయం సీఎం జగన్ దృష్టికి పోవటంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేను తాడేపల్లికి పిలిపించారట.
ఈ సందర్భంగా గొడవకు అసలు కారణం తెలుసుకున్న సీఎం జగన్ , ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా బహిరంగ సమావేశాల్లో గొడవకు దిగటం మంచి పరిణామం కాదని సీఎం జగన్ హితబోధ చేసినట్లు చెపుతున్నారు. పార్టీ లో నెంబర్ 2 గా ఉంటున్న విజయసాయి రెడ్డి మీద సొంత పార్టీలోని నేతలే ఇలా ఆరోపణలు చేస్తుంటే సీఎం జగన్ పట్టించుకోకుండా ఎలా ఉంటాడు. పైగా ఉత్తరాంధ్ర మొత్తానికి ఇంచార్జి గా విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నాడు, అలాంటి నేతపై తిరుగుబాటు జరగటం అంటే మాములు విషయం కాదుగా