నిమ్మగడ్డ విషయంలో కీలక నిర్ణయం దిశగా జగన్..? అదే కనుక జరిగితే..?

nimmagadda vs jagan

 ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా ప్రతి పరిణామం చాలా విచిత్రంగా వింతగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొద్దీ నెలల నుండి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు, సీఎం జగన్ కు పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. ఒకరికి మించి మరొకరు అతిగా వ్యవహరిస్తూ తమ తమ స్థాయిలను మరచి గొడవలకు దిగారు. ఎలాగైనా సరే పదవిలో నుంచి దిగేలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ, ఆయన పదవిలో ఉన్నంతకాలం ఎన్నికలకు వెళ్లకూడదని వైసీపీ సర్కార్ మొండి పట్టుదలతో ఉన్నారు.

nimmagadda vs jagan

 ఈ నేప‌థ్యంలో వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప్రొసీడింగ్స్ పంపారు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ వ‌స్తుంద‌న్న ఆందోళ‌న నెల‌కున్న ప‌రిస్థితుల్లో ఫిబ్ర‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేమ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న అభిప్రాయాన్ని ఎస్ఈసీకి తెలిపింది. అలాగే ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలంటూ హైకోర్టులో రాష్ట్ర ప్ర‌భుత్వం పిటిష‌న్ దాఖ‌లైంది.

 తాజాగా రాష్ట్ర హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. అంత‌టితో ఆగ‌లేదు, ఎస్ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని ఆదేశాల్లో పేర్కొంది. కరోనా పరిస్థితులపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. ఎస్ఈసీతో అధికారుల బృందం చర్చించిన అంశాలను తెలపాలని, అనంత‌రం ఈనెల 29న తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.

 అయితే కోర్ట్ తీర్పును గౌరవించి ప్రభుత్వం తరుపున ముగ్గురు అధికారులను పంపించటం అనేది జరిగే పని కాదని అర్ధం అవుతుంది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్ట్ కు వెళ్లాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి చివరి నాటికీ ఎలాగూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుండి తప్పుకుంటాడు కాబట్టి, అప్పటివరకు ఎలాగోలా ఇలా వాయిదాల మీద నెట్టుకొని రావాలనే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగితే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నిమ్మగడ్డ కోరిక తీరటం కష్టమే అవుతుంది.