ముఖ్యమంత్రి జగన్ యొక్క పట్టుదల గురించి, ఇచ్చిన మాట నెరవేర్చటం కోసం జగన్ పడే తాపత్రయం, ప్రజా సమస్యల మీద ఆయనకున్న అవగాహనా గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అందుకే అందరు ఆయన్ని ఒక హీరోగా చూస్తారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా జగన్ ను హీరోగా చూస్తుంది. దానికి కారణం న్యాయ వ్యవస్థలో పక్షపాతంగా తీర్పులు వస్తున్నాయని తెలిసిన వెంటనే బహిరంగంగా వాటిపై విమర్శలు చేస్తూ లేఖ రాయటం దేశంలో ప్రకంపనలు రేపింది.
జగన్ లేవనెత్తిన అంశాలపై అనేక మంది మాజీ జడ్జీలు మాట్లాడుతూ కచ్చితంగా వీటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెపుతూ జగన్ వాదనను బలపరిచారు. ఇదే సమయంలో కొందరు పచ్చ కామెర్ల వాళ్ళు మాట్లాడుతూ జగన్ తన మీద కేసుల విషయంలో భయపడి, జడ్జీలను మీద అపవాదులు వేస్తున్నారంటూ అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు. తండ్రి చనిపోయి కష్టాల్లో వున్నా జగన్ ను ఒక పక్క సోనియా మరో పక్క చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టిన వెనకడుగు వేయలేదు. అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైలుకు పంపిన బెదరలేదు. లక్ష కోట్లు లక్ష కోట్లు నిండు అసెంబ్లీ లో అవమానించిన సహనం కోల్పోలేదు. అలాంటి డైనమిక్ లీడర్ కు కొత్తగా కేసులు విషయంలో భయపడే అవసరం ఏమి వుంది.
ఇప్పటికిప్పుడు జగన్ బీజేపీ తో పొత్తుకు సిద్దమయితే తన మీద కేసులు గాలికి కొట్టుకొనిపోవటానికి నిమిషం పట్టదు. ఇదే కేసులు చంద్రబాబు మీద ఉంటే, బీజేపీ మోచేతినీళ్ళు తాగుతూ వాటిపై స్టే తెచ్చుకుంటూ, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ బయటపడే వాడు, కానీ జగన్ అలాంటి వ్యక్తి కాదు. న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగిన మనిషి, అందుకే తన మీద వున్నా కేసుల విషయంలో స్టే కోసం దొడ్డిదారులు తొక్కలేదు. జగన్ మీద అక్కసుతో తప్పుడు వార్తలు రాస్తూ, జగన్ తీసుకునే అద్భుతమైన నిర్ణయాలను ప్రజల్లోకి చేరకుండా రాష్ట్రంలో రెండు మూడు ప్రధాన మీడియా సంస్థలు చూస్తున్న కానీ, జాతీయ స్థాయిలో మాత్రం జగన్ చేసే ప్రతి పనికి అద్భుతమైన కవరేజ్ ఇస్తున్నారు…. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జగన్ ఒక హీరో అందులో ఎలాంటి సందేహం లేదు.