విశాఖ ఇప్పుడు పరిపాలన రాజధానిగా అవతరించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇకపై అక్కడ నుంచే రూలింగ్ చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన పనులు వేగవంతమయ్యయాయి. అయితే అంతకన్నా ముందు వైకాపా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అదే పార్టీని స్థానికంగా బలపరచడం. 2019 ఎన్నికల్లో రాష్ర్టమంతా వైసీపీ వేవ్ కొనసాగినా..విశాఖ గ్రేటర్ పరిధిలో మాత్రం ఆ దూకుడు లేదు. మొత్తం ఏడు స్థానాలకు గాను మూడు స్థానాలనే వైకాపా కైవసం చేసుకుంది. మిగిలిన నాలుగు స్థానాలు తేదాపా సొంతం చేసుకుంది. కీలక స్థానాలన్ని తేదాపా చేతిలోనే ఉన్నాయి. ఆ రకంగా వైకాపా గ్రేటర్ ఫరిదిలో పార్టీ బలం పరంగా వెనుకబడే ఉంది. అయితే ఇదంతా కేవలం గంటా శ్రీనివాసరావు కంచుకోట కావడమే వైకాపాకు ఎదురుదెబ్బ పడింది.
ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో గంటా వైకాపా గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గంటా బాటలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు నడిచే అవకాశం ఉందని స్థానికంగా చర్చకొచ్చింది. అయితే విశాఖ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రం ఫ్యాన్ కిందకు చేరతరా? అంటే అది మాత్రం అంత ఈజీ కాదు. 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గం ఆవిర్భవించగా అప్పటి నుంచి వెలగపూడి రామకృష్ణబాబే టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తున్నారు. నాటి నుంచి ఆ నియోజక వర్గంలో పసుపు జెండా తప్ప మరో జెండా ఎగరడానికి వీలు లేకుండా వెలగపూడి స్థానికంగా జెండా పాతేసారు. 2009 లో ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడిచినప్పుడు 4 వేల మెజార్టీతో వెలగపూడి గెలిచారు.
అదీ విశాఖ తూర్పులో వెలగపూడి సత్తా. అయితే ఇప్పుడా లెక్కను వైకాపా సెట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. పరిపాలనా రాజధాని కాబట్టి సిటీ మొత్తం జగన్ కంట్రోల్ లో ఉండాలంటే! వెలగపూడి నియోజక వర్గంలో వైకాపా బలం పెరగాలి. అంటే ఆ నియోజక వర్గంపై వైకాపా ప్రత్యేకంగా దృష్టిసారించి పనిచేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వైకాపా ఇప్పుడు ఆ పనిలో పడినట్లు తెలుస్తోంది. తూర్పు నియోజక వర్గంలో కొత్త కన్వీనర్ వేటలో పడిందట వైసీపీ. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని రంగంలోకి దించాలని యోచిస్తుందిట. పంచకర్ల గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
కాపు సామాజిక వర్గానిక చెందిన వ్యక్తి. టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడిగాను పనిచేసారు. అయితే 2019 ఎన్నికల తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి వ్యాపారాల్లో బిజీ అయ్యారు. ఆ నియోజక వర్గంలో యాదవులు, కాపులు, మత్స్యకారుల ఎక్కువ. అత్యధికంగా ఒక్క కాపు ఓటర్లే 40 వేలకు పైగా ఉన్నారు. పంచకర్లకు స్థానికంగా ఆ వర్గాలతో మంచి సత్ససంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడికి చెక్ పెట్టాలంటే పంచకర్లనే రంగంలోకి దించాలని వైకాపా భావిస్తోందిట. పంచకర్లతో వైసీపీ జిల్లా నేతలు చర్చలు జరుపుతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.