Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోనే నివాసం ఉండటం కోసం సొంత ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన వెలగపూడిలో తన ఇంటి నిర్మాణాన్ని చేపట్టబోతున్నారని తెలుస్తోంది. ఇంటి నిర్మాణం కోసం సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన స్థలం కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సచివాలయం కూడా వెలగపూడిలోనే ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా అక్కడే నివాసం ఉండటానికి సిద్ధమయ్యారు.
అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం విఐపి జోన్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులతో పాటు లాయర్లు జడ్జిలు వంటి వారందరూ కూడా ఇక్కడ తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈ ఇంటి నిర్మాణం కోసం సుమారు 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక మూడు సంవత్సరాలలోపు రాజధాని నిర్మాణం పై ఫోకస్ పెట్టి అధికార భవనాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు నిర్మించబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ వ్యవధిలోనే తన ఇంటిని కూడా ఈయన నిర్మించుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి తాడేపల్లిలో కానీ వెలగపూడి లో కానీ సొంత ఇల్లు లేదు ఈయన ఉండవల్లి కరకట్ట వద్ద లింగం లేని గెస్ట్ హౌస్ లో నివసిస్తున్నారు అయితే ఇక్కడ నివసిస్తున్నందుకు ఈయన అద్దె కూడా చెల్లిస్తున్నారు అయితే త్వరలోనే వెలగపూడిలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి రాబోతున్నారని తెలుస్తుంది.
ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు ఈయన అమరావతిలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే ఇకపై రాజధానిని ఎవరు మార్చలేరని భావిస్తున్నారు ఈ క్రమంలోనే అమరావతిని పరిపాలన రాజధానిగా వైజాగ్ ఆర్థిక రాజధాని అంటూ చంద్రబాబు నాయుడు కూడా జగన్ పాట పాడుతున్న విషయం మనకు తెలిసిందే.