Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పులివెందుల కంచుకోట లాంటిదని చెప్పాలి. గత నాలుగున్నర దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఎదురు లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలుకొని, వైయస్ విజయమ్మ వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు.
పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డిని వారి కుటుంబాన్ని ఢీకొట్టేవారు ఇప్పటివరకు లేరనే చెప్పాలి. ఇకపోతే రాబోయే ఎన్నికలలో జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి పక్కకు జరగబోతున్నారని తెలుస్తోంది. ఈయన 2029 ఎన్నికలలో పులివెందుల నుంచి పోటీ చేయడం లేదంటూ వార్తలు తెగచకర్లు కొడుతున్నాయి.
మరి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేయకపోతే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పులివెందుల తర్వాత అదే స్థాయిలో వైయస్ కుటుంబానికి ఆదరణ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైనా ఉంది అంటే అది జమ్మలమడుగు అని చెప్పాలి. జమ్మలమడుగులో కూడా వైయస్ కుటుంబానికి పూర్తిస్థాయిలో మద్దతు ఉంది.
ప్రస్తుతం జమ్మలమడుగు నుంచి బిజెపి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక్కడ ఆది కుటుంబానికి కాస్త కూసో పట్టు ఉన్న వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి నిలిచే సత్తా అయితే లేదని అంటున్నారు. ఏది ఏమైనా వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి కాకుండా జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారు అంటూ వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయినా రాజకీయాలలో ఎప్పుడు ఇలాంటి మార్పులు సంభవిస్తాయో ఎవరు ఊహించలేరని చెప్పాలి.