అదేశించడం..హెచ్చరికలు జారీ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానమే భిన్నంగా ఉంటుంది. పాలన విషయంలో రాజీ పడేది లేదని..చిత్త శుద్దితో..నిబద్ధతతో తనతో పాటు అందరూ కచ్చితంగా పనిచేయాల్సిందే అన్న టైపు. ప్రజలకు అందే సంక్షేమాల నుంచి కొవిడ్ కేర్ వరకూ జగన్ ప్రత్యేకంగా దృష్టిసారించి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన స్పందన వీడియో కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి అధికారులపై..కోవిడ్ ఆసుపత్రులపై..కొనసాగుతున్న పనులపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోని…నిబంధనలను అతిక్రమించి దౌర్జన్యానికి పాల్పడుతున్న ఆసుపత్రులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలో జాయిన్ అయిన అరగంటలోనే బెడ్ ఏర్పాటు చేయాలన్నారు. లేని ఆ పక్షంలో ఆసుపత్రిపై కఠినంగా వ్యవరించాలని హెచ్చరించారు. 104, 14410 అత్యవసర సేవలకు కాల్స్ వస్తే వెంటనే స్పందించాలని…కాలర్ తో సక్రమంగా గౌరవించి మాట్లాడలని లేదంటే ఉద్యోగం తొలగించేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ర్టంలో వర్షాలు కారణంగా ముంపు ప్రాంతాల వారికి తక్షణ సహాయం కింద కుటుంబానికి 2000 రూలు ఇవ్వాలని ఆదేశించారు. రెగ్యులర్ గా అందించే బియ్యంతో పాటు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళ దుంపలు, కిరోసిన్ తదితర నిత్యావసరాలు సెప్టెంబర్ 7 లోపు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్పందన కార్యక్రమంలో తన దృష్టికి వచ్చిన ఏ పనిలోనూ అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని అధికారులకు సూచించారు. వర్షాలు అధికంగా కురుస్తుండటంతో వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన రోగి పట్ల ప్రేమగా ఉండాలని..అలాగే ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కోవిడ్ అనుమానంతో ఏ జబ్బుతో ఆసుపత్రికి వచ్చినా చేర్చుకోక పోవడాన్ని హేయమైన చర్యగా వర్ణించారు. వివక్ష తగదని…ఆపత్కాలంలో ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు.