ప్రభుత్వం పనితీరును ప్రజల్లోకి తీసుకోని వెళ్ళటానికి బలమైన మీడియా తో పాటుగా మంచి వాక్చాతుర్యం కలిగిన నేతలు కూడా అంతే అవసరం. ప్రభుత్వ పనితీరు గురించి గొప్పగా చెప్పటానికి, అదే సమయంలో విపక్షాలు చేసే ఆరోపణలను తిప్పికొట్టడానికి వాళ్ళ అవసరం చాలా ఉంది. వాళ్లనే ఫైర్ బ్రాండ్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు అలాంటి నేతలు అవసరం బాగా వచ్చినట్లు తెలుస్తుంది. అందుకు తగ్గ నేతలను వెతికే పనిలో వైసీపీ పెద్దలు ఉన్నారని, అలాంటి నేతలకు గుర్తించి, వాళ్ళను మరింత బలమైన నేతలుగా చేయాలనీ చూస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రభుత్వం చేపడుతున్న పధకాలు ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్తున్నాయో తెలియదు కానీ, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు మాత్రం బలంగా వెళ్తున్నట్లు తెలుస్తుంది. మూడు రాజధానుల విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు ప్రభుత్వ వాదన కంటే విపక్షాలు వాదన ప్రజల్లోకి వెళ్ళింది. రాజధాని విషయంలో ఎక్కడ కూడా అమరావతి లో రాజధాని తీస్తున్నామని చెప్పలేదు, దానితో పాటుగా విశాఖ లో ఒకటి, కర్నూల్ లో మరొక రాజధాని పెడుతున్నామని చెప్పిన కానీ, ప్రజల్లో మాత్రం రాజధానిగా అమరావతిని తీసేస్తున్నారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది.
పోలవరం విషయంలో కూడా ప్రభుత్వ వాదనను ఎవరు పట్టించుకోవటం లేదు, మోడీకి భయపడి జగన్ పోలవరాన్ని వదిలేస్తున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సంఘటనలే చాలు వైసీపీ వాదనలు ప్రజల్లోకి వెళ్ళటం లేదని రుజువు చేయటానికి, మీడియా విషయానికి వస్తే టీడీపీకి వున్నా అనుకూల మీడియా వైసీపీ లేదనే చెప్పాలి. జగన్ సొంత పత్రికైనా సాక్షిలో ప్రభుత్వ వాదనను బలంగా పేపర్ మీద పెట్టె జర్నలిస్ట్ లు లేరేమో అన్నట్లు ఈ మధ్య సాక్షి కధనాలు రాస్తుంది. సాక్షి లో మంచిగా పనిచేసే కొందరిని జగన్ ఏరికోరి తన ప్రభుత్వంలోకి తీసుకోవటం కూడా సాక్షి కలంలో పదును తగ్గటానికి ఒక కారణం. ఇవన్నీ దృస్టలో పెట్టుకొని జగన్ తమ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాంటి నేతలకే ఇక ముందు పార్టీలో పెద్ద పీట వేయబోతున్నట్లు సమాచారం