ఆంధ్రలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా గురించి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు , రాష్ట్రంలో ఒకవైపు దరిద్రపు పాలన, మరోవైపు తుపాన్ల ప్రభావం ఉంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. పంటలు సహా సర్వం కోల్పోయిన ప్రజలను మంత్రులు ఎవరూ పరామర్శించలేదు అని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రేమో గాలిలో చక్కర్లు కొట్టి మమ అనిపించారు అని ఆయన విమర్శించారు. తుఫాన్లు, వరదల సమయంలో చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరించారో, ఎంత త్వరగా ప్రజలను ఆదుకున్నారో అందరికీ తెలుసనీ, హుద్ హుద్ సమయంలో చంద్రబాబు ఎంతచేశారో, ఎలా విశాఖ నగరాన్ని ఆదుకున్నారో అక్కడి ప్రజలకు తెలుసు అన్నారు.
అన్ని కార్యక్రమాల్లో నాడు- నేడు అని చెప్పే ముఖ్యమంత్రి, ప్రకృతి విపత్తుల సమయంలో నాడు చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరించాడో, నేడు తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటే మంచిది అని ఆయన వ్యాఖ్యానించారు. రూ.500ఇస్తే వాటితో శిబిరాల్లోని వారికి కడుపు నిండుతుందా? అని నిలదీశారు. రైతులకు సబ్సిడీ కింద రూ.6,500లు మాత్రమే ఇస్తామని చెప్పడం పాలకుల మూర్ఖత్వమే.
విజయసాయిరెడ్డి భూకుంభకోణాలు, కబ్జాలు, కూల్చివేతల్లో ముందుంటున్నాడు తప్ప, తుఫాను సమయంలో ఆయన ఉత్తరాంధ్రలో ఎక్కడా కనిపించలేదు అన్నారు.రైతులకు అన్యాయం జరుగుతుంటే రైతుసంఘాలు, రైతు నాయకులు ఏం చేస్తున్నారు అని, ముఖ్యమంత్రి తమచేతిలో పెట్టిన పప్పు బెల్లాలను నాకుతూ కూర్చున్నారా? అని సంచలన వ్యాఖ్యలు చేశాడు అయ్యన్నపాత్రుడు.
అయ్యన్నకు కౌంటర్
బహుశా గతంలో హుద్ హుద్ లాంటి తుఫాన్లు వచ్చిన సమయంలో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు స్వయంగా తానే వెళ్లి రంపంతో చెట్లు నరికివేసి, తానే స్వయంగా హైడ్రాలిక్ వాహనంలో పైకి వెళ్లి వీధి దీపాలను మరమ్మతులు చేసినట్లు, ఒక్కడే అర్ధరాత్రి ఒంటిగంట దాక కంట్రోల్ రూమ్ లో కూర్చొని అధికారాలకు ఆదేశాలు ఇచ్చినట్లు, సరిగ్గా పనిచేయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రస్తుత సీఎం జగన్ చేయకపోవటంతో అయన్నపాత్రుడు బాగా అసహనంతో ఉన్నాడని బాబుకు ఉన్న మీడియా తెలివితేటలూ, కవర్ ఫోటోలకు పోజులివ్వటం ఇంకా జగన్ నేర్చుకోలేదులే, కొత్త కదా కొంచం సమయం ఇవ్వు అయ్యన్న… అంటూ వైసీపీ నేతలు అయ్యన్న మీద కౌంటర్ వేస్తున్నారు