తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ, టీడీపీ పార్టీ లు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుని పోటీ కి సిద్ధంగా ఉన్నాయి. బీజేపీ నుంచి మాత్రం ఎవరు పోటీ చేస్తారు అన్నది ఇంకా తెలియలేదు. అసలు బీజేపీ చేస్తుందా, జనసేన చేస్తుందా అన్న విషయంలో క్లారిటీ రాలేదింకా, ఇటు చుస్తే టీడీపీ, వైసీపీ పార్టీ లు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుని ఉన్నాయి. ఇలాంటి అయోమయం పరిస్థితి లో ఉన్న బీజేపీ ని మరింత దెబ్బ తీసే విధంగా జగన్ ఓ ప్లాన్ వేశారు. టీడీపీ అయితే ఇక్కడ తమకు పోటీ కాదని వైసీపీ భావిస్తుండగా జగన్ బీజేపీ ని దెబ్బ తీయాలని వారి బాటలోనే వెళ్తున్నాడు. మత రాజకీయాలు చేయడంలో బీజేపీ పార్టీ కి పెట్టింది పేరు. ఏపీ లో ఇప్పుడిప్పుడే బలపడుతున్న అంతేర్వేది వంటి కొన్ని వివాదాల్లో బీజేపీ మత రాజకీయాలు చేసి చాలానే బలపడింది.అలాంటిది శ్రీనివాసుడి సన్నిధి లో మతాన్ని ఉపయోగించదని ఎవరు అనుకోరు. ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా మత రాజకీయాలు చేసి బలపడాలని చూస్తుంది.
బీజేపీ అవకాశాలని దూరం చేసి చెక్ పెట్టేందుకు విశాఖలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. విశాఖ సాగర తీరాన రుషికొండ వద్ద విశాలమైన ప్రాంగణంలో తిరుమల దేవుడి ఆలయాన్ని టీటీడీ చకచకా నిర్మిస్తోంది. ఈ ఆలయ నిర్మాణం కోసం ఏకంగా 28 కోట్ల రూపాయలను టీటీడీ ఖర్చు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులను చూసేందుకు ఈ మధ్యనే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఫిబ్రవరిలో ఈ ఆలయాన్ని పారంభిస్తారని కూడా సుబ్బారెడ్డి తెలిపారు. ఇక బీజేపీ మతపరమైన కారణాలు చూపి ప్రజలని అధికార పార్టీ వ్యతిరేకంగా మార్చలేదు కాబట్టి ఈ ఉప ఎన్నికలో వైసీపీ తిరుగులేకుండా విజయం సాధించబోతుంది అంట.