కెసిఆర్ కన్నా ఆ విషయాలలో జగన్ కే ఎక్కువ మార్కులు

jagan is better than kcr in that matters only

కరోనా గురించి అవగాహన అంతంత మాత్రంగా ఉన్నవేళ.. మీకు నచ్చినా నచ్చకున్నా.. కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందే. కలిసి నడవాల్సిందే. దాంతో ప్రయాణించాల్సిందే. అంతకు మించి మరో మార్గం లేదు. బాధతో చెబుతున్నానంటూ మహ్మమారి మీద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఎటకారం చేసినోళ్లు.. ఎక్కెశాలు చేసుకున్నోళ్లకు కొదవ లేదు. నవ్విన నాప చేనను పండక మానదన్న విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత అంతా తెల్లముఖం వేయటమే కాదు.. మిగిలిన వారి కంటే ఎంతో ముందుగా వాస్తవాన్ని అందరికి చెప్పే ప్రయత్నం చేసిన జగన్ ను అభినందించారు.

jagan is better than kcr in that matters only
kcr and ys jagan

వాస్తవానికి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదే. భయంతో వణికే వేళ.. భరోసాను ఇస్తూ.. చేదు వాస్తవాన్ని చెప్పటానికి మించిన మంచి పని మరొకటి లేదు. ఈ విషయంలో జగన్ అంత్య నిష్ఠూరం కంటే అది నిష్ఠూరానికే ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు. అలాంటి ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దేశంలోనూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహమ్మారి తీవ్రత తగ్గుతూ.. కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుచేముఖం పడుతున్నవేళ.. దాన్ని మరింత తగ్గించే ప్రయత్నం చేయాలి.

అందుకు భిన్నంగా స్కూళ్లు.. కాలేజీలు ఓపెన్ చేయాలన్న నిర్ణయంపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్కూళ్లు.. కాలేజీలు.. విశ్వవిద్యాలయాలు.. సినిమా థియేటర్లు ఇలా.. కొన్నింటి విషయంలో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. సానుకూలంగా నిర్ణయం తీసుకోవటానికి సిద్ధంగా లేరు. కారణం ఏమంటే..స్కూళ్లు..కాలేజీలకు సంబంధించి చూస్తే.. పేద.. మధ్యతరగతితో సహా అన్ని వర్గాల వారు ఏదోలా తమ పిల్లలు చదువుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా స్కూళ్లు..కాలేజీలు తెరవాల్సిన అవసరం లేదు.

ఒకసారి స్కూళ్లు.. కాలేజీలు.. విద్యా సంస్థలు తెరవటం షురూ చేస్తే.. పిల్లలు.. పెద్దలు అందరూ చాలా దగ్గరగా ఉంటారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ వాదనలో వాస్తవం ఏమిటన్నది ఇటీవల వెలువడుతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి. టీచర్లకు సంబంధించి పాజిటివ్ కేసులు నమోదైతే.. వారి ఇంట్లోని వారికి ఇబ్బంది. అదే పిల్లలకు జరిగే నష్టమేమంటే.. వారి ఇళ్లల్లోని పెద్ద వయస్కుల వారికి కొత్త ముప్పుగా మారుతుంది. ఈ కారణంతోనే.. జగన్ తీసుకున్న స్కూళ్ల ఓపెనింగ్ పై పలువురు తప్పు పడుతున్నారు.

కరోనా వైరస్ సగటుజీవి మీద ఎంతటి ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని ఇట్టే చెప్పేసిన జగన్.. స్కూళ్లు.. కాలేజీల విషయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. చూస్తుంటే.. ఆయనకు ఇచ్చిన బ్రీఫింగ్ లో ఏదో లోపం జరిగిందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. రోజురోజుకు ఏపీలోని స్కూళ్లలో పెరుగుతున్న కేసులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారక ముందే.. మేల్కొని కీలక నిర్ణయం తీసుకోవటం మంచిందటున్నారు. ఇదే అంశం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో ఏపీ సీఎం జగన్ కూడా పయనిస్తే మంచిదంటున్నారు.