2019 ఎన్నికల్లో బండ మెజారిటీ సాధించి మరి జగన్ సీఎం పీఠం ఎక్కాడు, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. ఐదేళ్లు ప్రతిపక్షములో ఉన్నామనే కసి కావచ్చు, పదేళ్లు చంద్రబాబు వలన అనేక ఇబ్బందులు పడ్డామనే కోపం కావచ్చు కానీ, అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ, ప్రతిపక్షములో ఉన్న టీడీపీ పార్టీని ఒక ఆట ఆడుకుంటుంది. ఇంట బయట అనే తేడా లేకుండా అసెంబ్లీ లో కావచ్చు, బయట కావచ్చు టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తుంది.
ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో అది మరింత తీవ్ర స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకొని సీఎం తో సహా అనేక మంది మంత్రులు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేశపడుతుంటే సీఎం జగన్ తో సహా అందరూ ఆ విషయాన్నీ కామెడీ గా చూస్తూ రకరకాల హాహాభావాలు ప్రదర్శిస్తూ బాబును చులకన చేసే ప్రయత్నం చేశారు , కానీ చంద్రబాబు మాత్రం కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టె విధంగా అసెంబ్లీ లో పావులు కదిపి సక్సెస్ అవుతున్నాడు.
తాజాగా అసెంబ్లీ లో జరిగిన ఒక సంఘటన చూస్తే టీడీపీ ని చూసి వైసీపీ భయపడుతుందేమో అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. 2019 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. అసలు రైతుల కోసం ప్రభుత్వం బీమానే చెల్లించలేదని, సమాచార హక్కు చట్టం ద్వారా తీసిన సమాచారంతో సభలో ఆధారాలు చూపించింది టీడీపీ. ఈ విషయమై మాట మార్చి డిసెంబరు 15న కడతామని మాట మార్చింది ప్రభుత్వం. ఆ తరువాత ఈ విషయమై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోని అసెంబ్లీ సమావేశాల్లో పంట బీమాపై చర్చ జరిగిన కొన్ని గంటలకే.. రాత్రి 9 గంటలకు రైతుల షేర్ కింద 590 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించేందుకు జీవోను విడుదల చేసింది ప్రభుత్వం.
ఈ ఒక్క సంఘటన చాలు చంద్రబాబు అంటే వైసీపీ భయపడుతోందని చెప్పటానికి, మొన్న అసెంబ్లీ లో బాబు మాట్లాడటానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అనుమతి ఇవ్వటంతో ప్రతిపక్ష నేత రైతు బీమా సమస్యను రైజ్ చేయటంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది, ఇక అలాంటి సంఘటన మరోసారి జరగకూడదనే ఆలోచనతో గత రెండు రోజుల నుండి చంద్రబాబుకు మాట్లాడానికి మైక్ కూడా ఇవ్వకుండా అడ్డుకుంటుంది వైసీపీ.