చాలా రోజుల తర్వాత నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రత్యేకంగా జగన్ మరియు న్యాయవ్యవస్థ మధ్య జరుగుతున్నా యుద్ధం గురించి తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. న్యాయ వ్యవస్థ ముందు అందరు సమానులు అనేది పచ్చి అబద్దం. డబ్బున్న వాళ్ళకే హైకోర్టులు, సుప్రీంకోర్టు లు తప్ప పేదవాడికి కాదు. అదే విధంగా న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులు కూడా మనుషులే అని, మనలాగే కొందరు ప్రభావితమై తీర్పులు చెపుతారని, అదే సమయంలో నిజాయితీగా తీర్పులు చెప్పే వాళ్ళుకూడా ఉన్నారని చెప్పుకొచ్చాడు.
జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం, దానిని ప్రెస్ కి విడుదల చేయటం గురించి మాట్లాడుతూ, చదరంగంలో సిఫాయిలు, గుర్రాలు, ఏనుగులు, మంత్రి ఇలా మొదలైన వాళ్ళు చాలా మంది వుంటారు. మొదట యుద్ధం చేసేది సిఫాయి, కానీ ఒక్క దానికి పరిమితులు తక్కువ, గుర్రం అనేది L ఆకారంలో ఎటైనా పోవచ్చు, మంత్రి కి ఎలాంటి పరిమితులు లేకుండా వెళ్ళవచ్చు, ఈ చదరంగంలో అంతిమంగా ఉండేది రాజు, కానీ అతనికి ఒకే ఒక్క అడుగు వేయటానికి మాత్రం ఛాన్స్ ఉంటుంది. యుద్ధం మొత్తం రాజు చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి ముందు తన సైన్యాన్ని దించి, ఆ తర్వాత రాజు రావాలి తప్పితే, ముందే రాజు నేను చూసుకుంటానంటూ దిగి, ఇష్టం వచ్చినట్లు వెళ్లాలంటే కుదిరేపని కాదు, ఆట యొక్క నియమాలు కూడా ఒప్పుకోవు, సీఎం జగన్ కూడా ఒక రాజు లాంటి వ్యక్తి. ముందు అతని సైన్యాన్ని దించి పోరాటం చేయాలి. వీలుకాని పక్షంలో తాను దిగాలి తప్పితే, వాళ్ళకంటే ముందే రావటం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చాడు.
అయితే జగన్ ఏమి రాజ్యాంగ నియమాలు తెలియని వ్యక్తి కాడు. అతనికి అన్ని విషయాలు తెలిసిన కానీ, ఇలా ప్రత్యక్ష పోరుకి సిద్దమయ్యాడంటే అతని ఆలోచనలు అతనికి ఉండవచ్చు. అందులో భాగంగానే సుప్రీంకోర్టు కి రాసిన లేఖను బహిర్గతం చేసి, దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేయటంలో సక్సెస్ అయ్యాడంటూ ఉండవల్లి చెప్పుకొచ్చాడు. అయితే ఉండవల్లి ప్రెస్ మీట్ ఆసాంతం గమనిస్తే ఆయన జగన్ కి అనుకూలంగా మాట్లాడాడో, లేక జగన్ కి హెచ్చరికలు జారీచేయాలని భావించాడో సరిగ్గా అర్ధం కాలేదు. ఎన్టీఆర్ కి జగన్ కి పోలికపెట్టాడు. 1960 రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు పోలిక తెచ్చాడు, మార్గదర్శి రామోజీ అన్నాడు, సుప్రీంకోర్టు కేసులన్నాడు. ఇలా అనేకమైన వాటిని లేవనెత్తి దేనికి కూడా క్లారిటీగా సమాధానం చెప్పకుండా అర్ధం చేసుకున్నోడికి అర్ధం చేసుకునేంత అంటూ వెళ్ళిపోయాడు. అయితే జగన్ ను పోలుస్తూ ఉండవల్లి చెప్పిన చదరంగం కథ మాత్రం ప్రెస్ మీట్ కే హైలైట్