వైఎస్సార్ ఫ్యామిలీ సక్సెస్ సీక్రెట్ జనాల్లో తిరగడమే. జనంలో తిరుగుతూ..ప్రజా నాడిని పట్టుకుని..వాళ్ల సమస్యల పై గళమెత్తి వినిపించి సక్సెస్ అయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే దారిలో జగన్ మోహన్ రెడ్డి నడిచి సక్సెస్ అయ్యారు. అధికారంలో ఉన్న టీడీపీని మట్టి కరిపించారంటే కేవలం ప్రజల మధ్యలో తిరగడం వలనే. సరిగ్గా ఎన్నికలకు ముందొస్తు ప్రళాళికగా జగన్ రోడ్డెక్కడంతో సీన్ ఒక్కసారిగా మారింది. టీడీపీ పాలనపై విసుగు చెందిన ప్రజలు ఏకంగా 151 సీట్లతో జగన్ ని పీఠం ఎక్కించారు. ఇక్కడ జగన్ సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక్క రీజన్ ప్రజలతో కలసి ప్రయాణించడం వల్లే. తాజాగా ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జగన్ మరోసారి జనాల్లోకి రావడానికి సిద్దమయ్యారు.
మెనిఫెస్టో లో ని 90 శాతం వాగ్దానాలాలను పూర్తిచేసిన నేపథ్యంలో జగన్ ధైర్యంగా జనాల్లోకి రావడానికి సంసిద్దమవుతున్నారు. ఏడాది పాలనపై ప్రజా నాడిని తెలుసుకునే యత్నం చేస్తున్నారు. రచ్చబండ, ప్రజాదర్భార్ వేదికలుగా ప్రజలతో మమేకం కానున్నారు. ఈ రెండు వేదికలు సాక్షిగా ఇప్పటివరకూ అమలు పరిచిన సంక్షేమ పథకాల గురించి నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకోనున్నారు. సంబంధిత అధికారులు, లబ్దిదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎదురుగా పెట్టుకుని అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సదర్భంగా జులై 8 నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది.
27 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. నవరత్నాల ద్వారా చేపట్టిన సంక్షేమాలు, వాటి అమలు తీరు, నగదు బధిలి వంటి అంశాల గురించి ప్రజలతో చర్చించనున్నారు. అందని వాళ్లకు తక్షణం సంక్షేమ ఫలాలు అందేలా స్పాట్ లో అందించడం జరుగుతుంది. అలాగే అందకపోవడానికి గల కారణాల్ని లబ్దిదారులను అడిగి తెలుసుకుంటారు. తద్వారా అధికారులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవలే ఏడాది పాలనపై అధికారులతో కలిసి రివ్యూ చేసిన జగన్ దానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది.