పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సహాన్ని నింపడానికి ఎప్పుడు ఏదో ఒక నూతన నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సహం నింపడానికి పార్టీలో సమూల మార్పులు శ్రీకారం చుట్టనున్నారని తెల్సుతుంది. తన క్యాబినెట్ బృదంతో సహా జిల్లాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులను కూడా మార్చనున్నట్టు సమాచారం. తన కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునే సమయంలోనే ప్రస్తుతం మంత్రులుగా పదవులు పొందుతున్నవారు రెండున్నరేళ్ల తర్వాత మార్పునకు రెడీగా ఉండాలని అప్పట్లోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏడాదిన్నర సమయం అయిపోయింది. సో.. మరో ఏడాదిలో ఇప్పుడున్న మంత్రులను మార్పు చేయడం ఖాయం.
ఎవరిని మార్చనున్నారు?
రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ, వైసీపీని కూడా విమర్శలపాలు చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం, మంత్రి నారాయణ స్వామిలకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. అలాగే ముగ్గురు మహిళా మంత్రుల్లో హోం శాఖ మంత్రి సుచరిత తప్ప మిగిలిన ఇద్దరూ ఇంటి ముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరో వృద్ధ మంత్రి, పశ్చిమకు చెందిన శ్రీరంగ నాథరాజుకు కూడా శ్రీముఖం తప్పేలా లేదని అంటున్నారు. అనిల్ కుమార్ స్థానంలో పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి యాదవ్‌కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అలాగే కొడాలి నానిని ఉంచాలా లేక తొలగించాలా అనే అంశంపై వైసీపీలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మహిళల్లో శింగనమల ఎమ్మెల్యే పద్మకు మంత్రిగా అవకాశం ఉంటుందని సమాచారం.
ఈ నిర్ణయం వల్ల పార్టీలో ఉత్సాహం పెరుగుతుందా!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వైసీపీ నేతల్లో నూతన ఉత్సాహం వస్తుందని కొంతమంది అంటుంటే మరికొంత మంది మాత్రం ఈ నిర్ణయం వల్ల అభివృద్ధి కుంటూ పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న మంత్రులకు తమ శాఖల పట్ల ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది ఇలాంటి నేపథ్యంలో వాళ్ళను తప్పించి, నూతన మంత్రులను నియమిస్తే అభివృద్ధి కుంటూ పడే అవకాశం ఉంటుంది.