కరోనా వల్ల రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది చనిపోయారు, చాలా మంది కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వల్ల మరణించారు. ఇలా మరణాలు సంభవిస్తున్న తరుణంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఆసుపత్రుల యాజమాన్య నిర్వాకం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. స్వర్ణా ప్యాలస్ లో చెలరేగిన మంటల వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణా ప్యాలస్ ను అద్దెకు తీసుకొని కరోనా కు చికిత్స చేసే సెంటర్ గా చేశారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో రమేశ్ ఆసుపత్రి కాసుల కక్కుర్తి స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాన్యాల నిర్ణక్యమే కారణమని కమిటీ విచారణలో తేలినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వారు అగ్నిమాపకదళానికి సమాచారం ఇవ్వకుండా రోగుల ప్రాణాలు పోయేలా చేశారని కమిటీ తేల్చింది. ఫైర్ సర్వీసుకు సమాచారం వస్తే రోగుల ప్రాణాపాయం తప్పేదని తేల్చారు.
అగ్ని ప్రమాదం గుర్తించే అలారమ్స్ పని చేయలేదని, ఆసుపత్రి యాజమాన్యం అనుమతికి మించి కరోనా భాదితులు చేర్చుకున్నారు. స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న ఇంటీరియర్ కు శానిటైజేర్ ను ఎక్కువ చేయడంలో మంటలు ఇంకా ఎక్కువ చెలరేగాయని అధికారులు తెలిపారు. అయితే ఆసుపత్రి యజమాని రమేష బాబు పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. రమేష్ బాబును ఎలాగైనా అదుపులోకి తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జగన్ ఆదేశాలను అందుకున్న అధికారులు రమేష్ బాబు కోసం మూవీ రేంజ్ లో ఛేజింగ్ జరుగుతుంది. ఈ ఛేజింగ్ ఎప్పటికి ఎండ్ అవుతుందో, రమేష్ బాబుకు ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి.