ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సీఎం జగన్ మరియు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కలిసి పనిచేయాలని ఒక అధికారి చెప్పాడు. ఆయనేమి అల్లాటప్పా అధికారి కాదు, చంద్రబాబు నాయుడు సీఎం గా పనిచేసిన సమయంలో అయన హయాంలో అనేక కీలక శాఖల్లో విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యాడు, ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ గా ఆయన్ని తీసుకొచ్చి మరి సీఎం పేషీలో కుర్చోపెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన ఎలాంటి అధికారి అనేది, ఆయనే మాజీ ఐఏఎస్ పీవీ రమేష్.
జగన్ సీఎం అయిన తర్వాత ప్రత్యేక అధికారాలతో సీఎం పేషీలో పనిచేసిన పీవీ రమేష్ ను, ఏమైంది ఏమో కానీ ఉన్నట్లుండి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ప్రక్షాళన పేరుతో పీవీ రమేష్ ను బాధ్యతల నుంచి తప్పించారు. అదే సందర్భంలో అజయ్ కల్లం రెడ్డిని మాత్రం ఉంచారు. అయితే మరేదైనా పదవి ఇస్తారేమో అని చాలా కాలం పీవీ రమేష్ ఎదురు చూసి చూసి, చివరకు జగన్ కు గుడ్ బయ్ చెప్పారు. పీవీ రమేష్ ను తప్పించటం పై రకరకాల కధనాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. అయితే వాటిపై ఎప్పుడు కూడా ఈ మాజీ ఐఏఎస్ స్పందించిన దాఖలాలు లేవు.
పదవి నుండి తప్పుకున్న తర్వాత తన ట్విట్టర్ అకౌంట్ లో అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని ట్విట్స్ మాత్రం వేస్తుంటాడు. తాజాగా జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి కలిసి పని చేయాలని, రాష్ట్ర హితం కోసం ఇద్దరూ కలిసి పని చేయాలని ట్వీట్ చేసారు. దీనిపై పలువురు స్పందిస్తూ , పీవీ రమేష్ లాంటి సీనియర్ ఐఏఎస్ కూడా జగన్ వద్ద పని చేయలక వచ్చేసారని, అలాంటిది చంద్రబాబు ఎలా కలిసి పని చేయగలరని, సీఎం జగన్ ప్రతి ఒక్కరిని శత్రువుగానే చూస్తారని, అలాంటిది పోయిపోయి చంద్రబాబుతో కలిసి పనిచేయటం అంటే జరిగేపని కాదని కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఇన్నేళ్లు మౌనంగా ఉంటున్న ఈ మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ ఇప్పుడు ఒక్కసారిగా సీఎం జగన్ మరియు చంద్రబాబు కలిసి పనిచేయాలని ఎందుకు చెప్పినట్లు, పరిపాలన లో అనుభవం లేని జగన్ నిర్ణయాలను చూసి ఇలా ఇన్ డైరెక్ట్ గా ఏమైనా విమర్శలు చేస్తున్నాడో..? లేక, పరిపాలన విషయంలో చంద్రబాబు నుండి ఇన్ పుట్స్ తీసుకోమని సలహా ఇస్తున్నాడో..? ఏమో