వైకాపా ఏడాది పాలనపై నిత్యం విమర్శలు, ఆరోపణలతో సర్కార్ పై పోరాటాన్ని ఉధృతం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ దూకుడుకు సర్కార్ కళ్లం దిశగా అడుగులు వేస్తోంది. గురువారం జరిగిన రాష్ర్ట మంత్రి మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తేదాపా పాలనలో రాష్ర్టంలో తమ అనుమతి లేకుండా సీబీఐ కేసులు దర్యాప్తు చేయడానికి వీలు లేదని చంద్రబాబు ఆంక్షలు విధించగా అదే సీబీఐతో ఆయన ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపించాలని వైకాపా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమరావతి రాజధాని భూములు అక్రమాలపై విచారణను వైకాపా ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే.
తాజాగా టీడీపీ హయాంలో అమలైన చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని మంత్రి మండలి నిర్ణయించింది. చంద్రబాబు పథకాల్లో అక్రమాల పరిశీలన కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికను సీఎం జగన్ కు సమర్పించింది. అలాగే నాటి ఐటీ మంత్రి లోకేష్ నేతృత్వంలో నడిచిన ఫైబర్ నెట్ పథకంలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు కేబినెట్ సబ్ కమిటీ కీలక అంశాలను సేకరించింది. వీటి ఆధారంగా తండ్రీకొడుకులపై సీబీఐ విచారణ చేయించాలని కేబినెట్ నిర్ణయించింది. చంద్రన్న కానుక, తోఫా పథకాల ద్వారానే సుమార్ 158 కోట్లు అవకతవకలు జరిగనట్లు కెబినేట్ ప్రాధమికంగా నిర్ధారించింది.
హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా ద్వారా ఏడాదికి 40 కోట్లు ఖర్చు పెట్టారని కమిటీ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కానుకలకు సంబంధించిన వ్యవహారాలు జరిగాయి. తేదాపా హయాంలో ఆశాఖల మంత్రులుగా పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు వ్యవరించారు. అలాగే ఈవీఎం ట్యాంపరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోంటున్న టేరాసాప్ట్ అధినేత వేమూరి హరిప్రసాద్ అన వ్యక్తికి ఫైబర్ నెట్ హెడ్ గా నియమించాలని అర్హత కలిగిన కంపెనీలను పక్కకు నెట్టేసి వేమూరికి చెందిన కంపెనీకి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ని క్టట్టబెట్టారని తద్వారా గత ప్రభుత్వం పెద్దలు సుమారు 700 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డట్లు కేబినెట్ సబ్ కమిటీ దర్యాప్తులో తేలింది. వీటన్నింటిపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కు రంగం సిద్దం చేస్తుంది.