జగన్- బాబుల ప్లాన్ తో విలవిలలాడబోతున్న బీజేపీ

babu modi jagan telugu rajyam

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదగడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి బీజేపీ నేతలు పతకాలు రచిస్తున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రచిస్తున్న వ్యూహానికి బీజేపీ తప్పక బలి అవ్వాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీతో కలిసి పని చెయ్యడానికి సిద్ధమే అన్నట్టుగా ఉంటూనే బీజేపీని పాతేయడానికి పతకాలు రచిస్తున్నారు.

bjp
bjp

బీజేపీని రానివ్వరా!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీపీడీ తరువాత మూడో శక్తిగా, ప్రత్యాన్మయ శక్తిగా ఎదగడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో జగన్ బాబులు బీజేపీ పెద్దలకు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉంటే నువ్వైన, లేదా నేనైనా ఉండాలి మూడో వ్యక్తికి స్థానం ఇవ్వకూడదు అనే ధోరణిలో బాబు, జగన్ లు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా టీడీపీ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఓ జాతీయ స్థాయి సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రతిపక్షం టీడీపీ పుంజుకుందని, అధికార పక్షం అదనంగా బలం పెంచుకుంటుందని వెల్లడించింది.

jagan cbn telugu rajyam
jagan cbn telugu rajyam

అలాగే టీడీపీ సుప్రీం కోర్ట్ పెద్దలను కూడా ప్రభావితం చేస్తుందని వైసీపీ నాయకులు చెప్పడం, లేఖలు కూడా రాస్తూ పడిపోయిన టీడీపీ యొక్క స్థానాన్ని వైసీపీ నాయకులే పెంచుతున్నారు. అంటే ఇలా టీడీపీ స్థానాన్ని పెంచి రాష్ట్రంలో పోటీ ఉన్నది, ఉండబోయేది టీడీపీ, వైసీపీ మధ్యని ప్రూవ్ చేయడానికే వైసీపీ, టీడీపీ నాయకులు ఇలా కలిసి నాటకం ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పతకంతో ఏపీలో ఎదగాలనుకుంటున్న బీజేపీ ఆశలు బుగ్గిపాలు కాబోతున్నాయి.

బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు ఎందుకో!

బీజేపీని అణిచివెయ్యడానికి వైసీపీ, టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే దానితో పొత్తులు పెట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. కేంద్ర స్థాయిలో ఎన్డీయేలో చేరడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధమయ్యారు. అలాగే రాష్ట్ర స్థాయిలో బీజేపీతో పొత్తుపెట్టుకోవడానికి టీడీపీ నాయకులు కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒకపక్క బీజేపీని అణిచివేయడానికి పతకాలు రచిస్తూనే మరో పక్క దాన్ని నేలమట్టం చేయడానికి సిద్ధమవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా పరవాలేదు కానీ రాష్ట్రంలో మాత్రం పోటీ మాత్రం తమ రెండు పార్టీల మధ్యన ఉండాలని టీడీపీ, వైసీపీ నాయకులు భావిస్తున్నారు, అందుకు వ్యూహాలు కూడా రచిస్తున్నారు.