Satya Sri: తెలుగు ప్రేక్షకులకు లేడీ కమెడియన్ సత్య శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో తో పాటు అదిరింది చాలా కామెడీ షోలు చేసి లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది సత్య శ్రీ. ముఖ్యంగా సత్య జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర తో కలిసి ఎన్నో స్కిట్లు చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కొన్ని సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లేడీ కమెడియన్ గా జబర్దస్త్ వంటి కామెడీ షోలు చేస్తూనే మరొకవైపు సినిమాలలో నటిస్తోంది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది సత్య శ్రీ.
అయితే గత కొద్ది రోజులుగా ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ఈసారి బిగ్ బాస్ సీజన్ లోకి ఆమె ఎంట్రీ ఇవ్వడం పక్కా అంటూ కామెంట్లు వినిపించాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో తాజాగా ఈ వార్తల గురించి ఒక ఇంటర్వ్యూలో స్పందించింది సత్య శ్రీ. బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందా, వస్తే వెళ్తారా అని అడగ్గా సత్యశ్రీ సమాధానమిస్తూ.. బిగ్ బాస్ కి నన్ను ఆల్రెడీ అడిగారు.
అప్పుడు ఇంట్లో పరిస్థితుల వల్ల వెళ్ళలేదు. ఇప్పుడు అడిగితే వెళ్తాను. ఈ సీజన్ అయితే కుదరదు సినిమా కమిట్మెంట్స్ ఉన్నాయి. వచ్చే సీజన్ అడిగితే మాత్రం బిగ్ బాస్ కి వెళ్తాను అని తెలిపింది. సత్యశ్రీ డైరెక్ట్ గానే ఆఫర్ మళ్ళీ వస్తే వెళ్తాను అని చెప్పింది. కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా వచ్చే సీజన్ కి సత్యశ్రీ ని తీసుకొస్తారేమో చూడాలి మరి. అలాగే ఆమెకు సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి వెళ్లే అవకాశం లేదు అని ఆమె తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం నేను సత్య శ్రీ సీరియల్స్ కామెడీ షో లు ఆపేసి ఎక్కువగా సినిమాలలో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది సత్య శ్రీ.