సుడిగాలి సుధీర్ ని అవమానించిన జబర్దస్త్ యాజమాన్యం? షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆది?

బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. అలా జబర్దస్త్ ఫేమస్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మ్యాజిక్ చేస్తూ తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ షో ద్వార పాపులర్ అయిన తర్వాత సుధీర్ కి సినిమాలలో నటించే అవకాశాలు కూడా చాలా వచ్చాయి. ప్రస్తుతం సుధీర్ ప్రధాన పాత్రలలో నటించటమే కాకుండా హీరోగా కూడా ఎన్నో సినిమాలలో నటిస్తున్నాడు. ఇలా బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన సుధీర్ తనకి ఇంత గుర్తింపు రావడానికి కారణమైన జబర్దస్త్ కి దూరమయ్యాడు.

దీంతో ఈ విషయంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ యాజమాన్యం వారు సుధీర్ ని అవమానించడం వల్లే సుధీర్ జబర్దస్త్ నుండి బయటికి వచ్చారని వార్తలు వచ్చాయి. అలాగే మరొక జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ గురించి జబర్దస్త్ యాజమాన్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్ నాణ్యమైన భోజనం కూడా అందించరు. సుధీర్ కి పర్సనల్ లైఫ్ లేకుండా చేశారు. జబర్దస్త్ కోసం సుధీర్ తన జీవితాన్ని త్యాగం చేశాడు. కానీ జబర్దస్త్ లో కొందరూ సుధీర్ ని అవమానించడం వల్ల సుధీర్ బయటికి వచ్చాడని ఆర్పీ వ్యాఖ్యానించాడు.

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది, రామ్ ప్రసాద్ జబర్దస్త్ గురించి, జబర్దస్త్ యాజమాన్యం గురించి ఆర్పీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆర్పీ చెప్పిన వాటిలో నిజం లేదని అన్నారు. ఇక సుధీర్ కి అవమానం జరిగిందని వస్తున్న వార్తల గురించి కూడా మాట్లాడుతూ.. జబర్దస్త్ లో సుధీర్ కి ఎటువంటి అవమానం జరగలేదని, వారితో సుదీర్ కుదుర్చుకున్న అగ్రిమెంట్ పూర్తవటంతో , వరుస సినిమాలతో బిజీ అవ్వడం వల్ల సుధీర్ జబర్దస్త్ మానేశారు అంటూ ఆది చెప్పుకొచ్చాడు. ఇలా కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలలో నిజం లేదని పలువురు జబర్దస్త్ కమెడియన్స్ చెప్పుకొచ్చారు.