సుమను ఆంటీని చేసేశారు.. జబర్దస్త్ గ్యాంగ్ రచ్చ మామూలుగా లేదు!!

Jabardasth Lady Getup Artists Imitate Suma In Cash

బుల్లితెరపై సుమ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. యాంకరింగ్‌లో రాజమాత లాంటిది. మకుటం లేని మహారాణి అంటూ అందరూ రాసేస్తుంటారు. దశాబ్దానికి పైగా సుమ నెంబర్ వన్ స్థానంలో ఉంది.. ఇంకో దశాబ్దం అయినా కూడా అదే స్థానంలో ఉంటుంది. కాలాలు మారినా తరాలు మారినా సుమ ఎప్పటికీ టాప్ ప్లేస్‌లొనే ఉంటుంది. అందరూ సుమక్క అనాల్సిందే. అయితే ఈ మధ్యే ఆ పిలుపు కాస్తా మారేలా కనిపిస్తోంది. ఇంత వరకు ఎవ్వరైనా సరే సుమక్క అని సంబోధించేవారు.

Jabardasth Lady Getup Artists Imitate Suma In Cash
Jabardasth Lady Getup Artists Imitate Suma In Cash

కానీ తాజాగా సుమను అందరూ కలిసి ఆంటీని చేసేశారు. జబర్దస్త్ లేడీ గెటప్పులు వేసే ఆర్టిస్ట్‌లందరినీ గెస్ట్‌లుగా తీసుకుంది. క్యాష్‌లో లేడీ గెటప్ ఆర్టిస్ట్‌లందరూ ఈ శనివారం సందడిచేయనున్నారు. అయితే ఇందులో రెండో కోణాన్ని కూడా చూపించనున్నట్టు తెలుస్తోంది. మొదట అందరూ లేడీ గెటప్పులు వేసుకునే ఉన్నారు. అప్పుడు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. సుమను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆంటీ అంటూ పరువుతీశారు.

వినోదిని బాస్కెట్ బాల్ వేయగా.. అది సుమ తలకు తాకింది. దాంతో సుమ కళ్లు తిరిగిపోయినట్టు పడిపోయినట్టు నటించింది. ఇక ఆ ఘటనతో సుమ ఆంటీకి న్యాయం చేయాలని అక్కడే క్యాష్ సెట్ వద్దే అందరూ ధర్నాకు దిగినట్టు బిల్డప్ ఇచ్చారు. సుమ ఆంటీకి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అలా సుమక్కను కాస్త సుమ ఆంటీగా మార్చేశారు. ఈ ఎపిసోడ్‌లో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు లేడీ గెటప్పులు వేసుకోవడం వల్ల బయట ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పి కంటతడి పెట్టించారు.