జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి ప్రమాదం.. ఏకంగా 15 కుట్లు!

జబర్దస్త్ కమెడియన్, నటుడు అదిరే అభి గురించి అందరికీ పరిచయమే. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. అలా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు. ఇక జబర్దస్త్ కు దూరంగా ఉంటూ వెండితెర పై పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఇతడు ఒక సినిమా షూటింగ్ సమయం లో గాయపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇక అతడి చేతికి 15 కుట్లు పడగా.. ఆయన కాళ్ళకు కూడా గాయాలయ్యాయి. ఇక కొన్ని రోజుల వరకు ఇతడికి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు.