Chebrolu Kiran: వైయస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు… చేబ్రోలు కిరణ్ అరెస్టుకు రంగం సిద్ధం!

Chebrolu Kiran: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళ అని కూడా లేకుండా ఆమె వ్యక్తిత్వం పట్ల అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఈయన మీసం మేలేస్తు మరో వైఎస్ భారతి గురించి తన పిల్లల గురించి అనుచితమైనటువంటి ఆరోపణలు చేశారు.

ఇలా చేబ్రోలు కిరణ్ దిగజారి మరి వైయస్ భారతి వ్యక్తిత్వం గురించి మాట్లాడటంతో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో పై వైసీపీ అభిమానులు వైసిపి నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈయన పట్ల చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేయడమే కాకుండా ఇదే మాటలు వైసిపి వారు మాట్లాడి ఉంటే ఈపాటికి అరెస్టు చేసేవారు కానీ ఈ మాటలు హోమ్ మినిస్టర్ అనితకు వినిపించలేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ మంత్రి నారా లోకేష్ కు ఇలాంటివి పట్టవా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

ఇలా చేబ్రోలు కిరణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయి ఈ క్రమంలోనే వెంటనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ విషయంపై అప్రమత్తం అవుతూ కిరణ్ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలోఖండించారు.మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో నేడు కిరణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారు.

భారతి గురించి కిరణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన వెంటనే క్షణికావేశంలో తాను ఇలాంటి వ్యాఖ్యలు చేశానని దయచేసి నన్ను ప్రతి ఒక్కరు క్షమించాలని కోరుతూ మరొక వీడియోను విడుదల చేశారు. అయినప్పటికీ ఈయన చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందేనటు వైసీపీ అభిమానులు డిమాండ్లు చేస్తున్నారు.