లోపాలని సరిదిద్దుకోలేని చేతకానితనమే..రాజకీయం!!

రాజ‌కీయాల స్వ‌రూపం అన్న‌ది ద‌శాబ్ధాల క్రిత‌మే మారిపోయింది. అందులోనూ ఏపీ రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించుకుంటే! వామ్మో అనాల్సిందే. ఏపీ రాజ‌కీయం అనేది రోజు రోజుకి ఊస‌ర‌వెల్లిలా రంగులు మార్చుకుంటూనే ఉంటుంది. అవ‌స‌రం మేర కొన్ని సంద‌ర్భాల్లో దాని రూప‌మే మారిపోతుంది. ఏపీలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు ద‌శాబ్ధాల క్రిత‌మే పునాది రాళ్లు ప‌డ్డాయి. ఫ్యాక్ష‌నే ఇప్పుడు రాజ‌కీయాన్ని ఏల్తోంది. అధికార పార్టీ-ప్ర‌తిప‌క్ష పార్టీ అంటూ ఏమీలేదు. నేటి రాజ‌కీయాల‌లో అన్ని పార్టీలు ఒక‌టే. ప‌రిస్థిత‌ల‌ను బ‌ట్టే ప్ర‌జ‌లు నాయ‌కుల్ని అర్ధం చేసుకోవ‌డం…పార్టీలు ప్ర‌జ‌ల్ని అర్ధం చేసుకుని ఓ అండ‌ర్ స్టాండిగ్ తో కూడిన ఓ  స‌రికొత్త  ప్ర‌జాస్వామ్యం అమ‌లులో ఉంది.

andhrapradesh political parties
andhrapradesh political parties

ప్ర‌జా స్వామ్యం దాని అర్ధం మార్చేయ‌డంలో కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుల‌దే త‌ప్పంటే పొర‌పాటే అవుతుంది. ఇక్కడ ప్ర‌జ‌లు  కూడా త‌క్కువేం  కాదు. నీతి..నిజాయితీగల నాయ‌కుల‌కు ఓట్లు ఎప్పుడు ప‌డ్డాయి. అస‌లు వాళ్ల ప‌క్షాన నిల‌బ‌డే ప్ర‌జా బ‌లం ఎంత అంటే‌? క‌చ్చితంగా శూన్య‌మ‌నే రాజ‌కీయాల‌పైనా..రాష్ర్ట ప‌రిస్థితుల‌పై ప‌రిపూర్ణ అవ‌గాహ‌న ఉన్న మేథావులు ఎంతో మంది  బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పారు. అలాంటి మేథావులు చెప్పిన మాట‌ల నుంచి పై వ్యాఖ్యలు ఉద్భ‌వించాయి. త‌ప్పులు జ‌ర‌గ‌డం స‌హ‌జం. స్వ‌లాభాలు..స్వ‌ప్ర‌యోజ‌నాలు ఆశించని రాజ‌కీయాలు అంటూ లేవిప్పుడు.

అయితే వాటితో పాటు, ప్ర‌జ‌ల‌కు ఎంతో కొంత మేలు జ‌ర‌గాలి. న‌మ్మి ఓట్లేసిన ప్ర‌జ‌ల‌కున్న న‌మ్మకాన్ని  కాస్తో కూస్తో నిల‌బెట్టుకోవాలి. ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ అనేది ఏక ప‌క్ష‌మే అయినా దాన్ని స‌రిదిద్దుకునే  ప్ర‌య‌త్నాన్నాని అధికార ప‌క్షం చేయాలి. చేసే ప్ర‌తి విమ‌ర్శ లో ఓ అర్ధం  ఉండాలి. అలా కాన‌ప్పుడు అధికార‌ప‌క్షానికి-ప్ర‌తిప‌క్షానికి మ‌ధ్య తేడా ఏముంటుంది. అలాంటి లోపాల్ని కూడా స‌రిదిద్దుకోక‌పోతే నాయ‌కులు…రాజ‌కీయం అనే ప‌దాలు అర్ధ ర‌హితంగానే మిగిలిపోతాయి.