Pawan Kalyan: సినీ నటుడు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాను పార్టీని నడిపించడం కోసం తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్నానని ఎవరి దయా దాక్షణాలపై పార్టీ నడపడం లేదని తెలిపారు. తాను సినిమాలలో సంపాదించింది మొత్తం పార్టీ కోసం ఖర్చు చేస్తూ పార్టీని నడిపిస్తున్నానని పవన్ తెలిపారు.
పార్టీపరంగా డబ్బులు అవసరమైతే ఒక సినిమా చేస్తానని, నిజాయితీగా రాజకీయాలు చేస్తానని చెప్పుకొచ్చారు.డబ్బుతో రాజకీయాలు చేయలేమని తేల్చి చెప్పారు. తన సొంత డబ్బులతోనే రాజకీయం చేస్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీ పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.రాజకీయాలు నడిపించినంత డబ్బు ఎక్కడిది? ఈ పదేళ్లపాటు సినిమాల ద్వారా వచ్చిన సొమ్ముతోనే పార్టీని నడిపారా? అందులో నిజం ఎంత? నమ్మడానికి అయినా వీలుందా అంటూ వైసీపీ
నేత పోతిన మహేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీని నడిపించడం కోసం డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు అంటూ ప్రశ్నించారు. ఆయన సినిమాలు చేసి పార్టీని నడిపిస్తున్నానని తెలిపారు. అయితే 2014 నుంచి ఆయన 2024 వరకు పవన్ కేవలం ఆరు సినిమాలు మాత్రమే చేశారు. ఈ ఆరు సినిమాలతోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నడిపించారా అంటూ ప్రశ్నించారు.
ఈ ఆరు సినిమాలకు గాను ఆయనకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఎన్ని ఖర్చులు పెట్టారు పార్టీ కోసం ఎంత ఖర్చు చేశారో అనే విషయాలన్నింటినీ త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతాను అంటూ పోతిన మహేష్ ఈ సందర్భంగా జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.