GST Raids: మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ముఖేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదలకు మరికొన్ని గంటలు సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ఆ ఏర్పాట్లలో ఉండగా ఇలాంటి సమయంలోనే కన్నప్ప టీంకు ఒక ఊహించని షాక్ ఎదురయ్యింది. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని హీరో మంచు విష్ణు ఆఫీస్ లో ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవలే భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని నిర్మించారు మంచు విష్ణు. ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. జీఎస్టీ, ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఐటీ జీఎస్టీ సోదాల విషయం తనకు తెలియదని అన్నారు విష్ణు. సోదాలు జరిపితే మంచిదే అని అన్నారు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదని అన్నారు విష్ణు. అంతేకాదు ఎక్కడెక్కడ అప్పులు చేశామో వాళ్లకే తెలుస్తుందని మంచు విష్ణు తెలిపారు.
ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విడుదలకు మరికొన్ని గంటలు ఉన్న సమయంలో ఇలా జరగడం ఒకరకంగా మూవీ మేకర్స్ ని షాక్ కు గురి చేసిందని చెప్పాలి. ఇకపోతే కన్నప్ప సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమాపై ఈ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ ఎంత ఉందో నెగటివ్ కూడా అలాగే ఉందని చెప్పాలి.. కొంతమంది ఈ సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత మాట్లాడండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు హీరో మంచు విష్ణు. డైరెక్టర్ కూడా ఈ విషయాల గురించి స్పందిస్తూ ఇప్పటికే శ్రీకాళహస్తి వంటి పెద్ద పెద్ద అర్చకులకు ఈ సినిమా చూపించామని వారు కూడా ఈ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.