2019 ఎన్నికలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పథకాలు ప్రతి ఒక్కరికి సులువుగా చేరాలన్న ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థను ప్రారంభించి, గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధిని కలిగిపించారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థకు జగన్ ఇబ్బందులు కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తన మానస పుత్రికగా జగన్ తెచ్చిన ఈ విధానం ఇప్పుడు జగన్ కె ఎదురు తీరిందని వైసీపీ నేతలు చెప్తున్నారు.
ఉద్యోగాలు ఇచ్చిన జగన్
చంద్రబాబు అయిదేళ్ల ఏలుబడిలో ఒక్క ఉద్యోగం కొత్తగా ఇవ్వలేదు. మరో వైపు చూస్తే నిరుగ్యోగ భృతి అంటూ ఎన్నికల వేళ హడావుడి చేసినా ఫలితం లేదు. కానీ జగన్ అధికారంలోకి వస్తూనే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లక్షలాదిమందికు ఉపాధి కలిపించారు. అలాగే సచివాలయాల ద్వారా మరింతమందికి ఉద్యోగాలు దొరికాయి. ఇలా నాలుగున్నర లక్షల మందికి బతుకు తెరువు దొరికింది గట్టిగా రెండేళ్లు కూడా ఈ వ్యవస్థకు పూర్తి కాలేదు. సరైన సమయం చూసి సర్కార్ వేతనాలు పెంచే అవకాశం కూడా ఉంది. కానీ ఇంతలోనే రాముడినే ఎదిరించిన హనుమంతుడి మాదిరిగా వాలంటీర్లు వీధిన పడడం మాత్రం సంచలనమే రేపుతోంది. జగన్ కి పాలాభిషేకాలు చేసి ఆయనను దేవుడిగా కొలిచిన వారిలో ఇంతలోనే ఇలా మార్పు రావడం అంటే రాజకీయ కలియుగం అనుకోవాలేమో.
వాళ్ళను గాడిలో పెట్టడం కష్టమా!!
జగన్ సర్కార్ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ జాతీయ స్థాయిలోనే మెప్పు పొందాయి. అయితే 13 జిల్లాలలో ఉన్న వీరందరినీ గాడిలో పెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా పూర్తిగా ఉపయోగించుకునే యంత్రాంగం లేదా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా వాలంటీర్ల డిమాండ్లు హేతుబద్ధమైనవే. అడిగిన తీరు మాత్రమే జగన్ సహా అందరికీ బాధించేలా ఉందని అంటున్నారు. రేపో మాపో ప్రభుత్వం వీరి వేతనాన్ని పెంచినా తాము పోరాడి సాధించుకున్నాం తప్ప ప్రభుత్వ గొప్పతనం ఏదీ లేదనే అంటారు. మొత్తానికి జగన్ మానసపుత్రిక కంట కన్నీరు ఒలకడం శుభ సూచకం కాదనే చెప్పాలి.