ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. తాను రిటైర్ అయ్యిపోయి లోపే ఎట్టి పరిస్థితిల్లో ఎన్నికలు నిర్వహించి తీరాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక వైపు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క వైసీపీ సర్కార్ మాత్రం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించటం కష్టమని, నిమ్మగడ్డ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని భావిస్తున్నాయి.
తాజాగా జరుగుతున్నా కొన్ని పరిణామాలు గమనిస్తే ఎన్నికల విషయంలో జగన్ సర్కార్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అధికారం చేపట్టిన నాటి నుండి జగన్ సర్కార్ కు అనేక ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి, తీసుకునే ప్రతి నిర్ణయం అనేక విమర్శలకు దారితీస్తుంది. మూడు రాజధానుల వ్యవహారం ఎక్కడికి అక్కడే ఉంది.. కోర్టులో ఆ వ్యవహారం నానుతూ ఉంది. ఈమధ్య కోర్టుల్లో వైసీపీ కి చేదు అనుభవాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ మూడు రాజధానుల వ్యవహారంలో కూడా ఏదైనా తేడా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పైగా కోర్టు న్యాయమూర్తులు సైతం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండడం, ప్రభుత్వం పై కోపంగాఉండడం గమనిస్తున్నవిషయమే.
ఇలాంటి సమయంలో మరో రాజ్యాంగ శక్తి అయినా ఎన్నికల కమిషన్ తో ఎందుకు వచ్చిన తలనొప్పులు, ఎన్నికల విషయంలో కోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు దారుణంగా పరువు పోతుంది. రాజ్యాంగ సంస్థ నిర్ణయాన్ని ఎల్ల కాలమూ ధిక్కరించడం సాధ్యం కాదన్న ఉద్దేశమో.. ఎన్నికలు పెట్టేస్తే పోలా.. అన్న అభిప్రాయమో కానీ.. కొత్త బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపచేసుకోవాలని నిర్ణయించారు.
ఈ బిల్లు ప్రకారం… పంచాయతీ ఎన్నికలు శరవేగంగా పూర్తి కానున్నాయి. రెండు అంటే రెండు వారాల్లో నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు పూర్తవుతాయి. పంచాయతీరాజ్ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు. వాటిని అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంది. నిమ్మగడ్డ పదవిలో ఉన్న లేకపోయిన ఆంధ్రాలో వైసీపీ కి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మంచి మద్దతు లభిస్తుంది, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన గెలుపు అవకాశాలు ఎక్కవుగా వైసీపీ కి ఉన్నాయి కాబట్టి వైసీపీ నేతలు ఎన్నికల విషయంలో ఒక మెట్టు కిందకు దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం