పెళ్లిలో నయనతార పట్టు చీర ధరించకపోవడానికి కారణం ఇదేనా?

గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో విహరిస్తూ ప్రేమపక్షులుగా ఉన్నటువంటి నయనతార విగ్నేష్ ఎట్టకేలకు జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇకపోతే నయనతార తన పెళ్లి వేడుకలో భాగంగా ఆమె ధరించిన డ్రెస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెళ్లిలో ప్రతి ఒక్కరూ పట్టు చీరను ధరిస్తారు. కానీ నయనతార ఇందుకు భిన్నంగా డిజైనర్ శారీ ధరించారు.

ఈ విధంగా నయనతార పట్టు చీర కాకుండా డిజైనర్ ఎరుపు రంగు చీర ధరించడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. విఘ్నేష్ శివన్ కుటుంబ ఆనవాయితీ ప్రకారం పెళ్లికూతురు ఎరుపు రంగు చీరను ధరించాల్సి ఉండడంతో ఈమె పట్టు చీర కాకుండా ఎరుపు రంగు డిజైనర్ సారీ ధరించారు. ఇక విఘ్నేశ శివన్ యధావిధిగా పట్టు పంచలో దర్శనమిచ్చారు. డిజైనర్ శారీలో పెళ్లికూతురుగా నయనతార చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నారు.

ఈ విధంగా నయనతార విగ్నేష్ ఎన్నో సంవత్సరాల ప్రేమ అనంతరం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహ వేడుకలను జరుపుకున్నారు.వీరి వివాహానికి కేవలం కొంతమంది ముఖ్య అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ఇకపోతే 11వ తేదీ చెన్నైలో జరిగే రిసెప్షన్ కి పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు బంధుమిత్రులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.