షకీలా జీవితం నాశనం కావడానికి కారణం ఇదేనా.. నమ్మలేని నిజాలు మీకోసం!

షకీలా ప్రముఖ దక్షిణ భారత చలనచిత్ర నటి. ఈమె ఎక్కువగా శృంగార భరిత చిత్రాలలో నటించడం అందరికీ తెలిసిందే. ఈమె పూర్తి పేరు సి.షకీలా బేగం. ఈమె 1973లో చెన్నైలో జన్మించింది. ఈమె తల్లిది నెల్లూరు కావడంతో అక్కడే పెరిగి, విద్యాభ్యాసం కొనసాగించింది. వీళ్లది చిన్న మధ్య తరగతి కుటుంబం. ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి.

కుటుంబ పోషణ కోసం ఈమె తల్లి వ్యభిచారం కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పదవ తరగతిలో ఫెయిల్ కావడం చేత తల్లి ప్రోత్సాహంతో ఈమె కూడా ఇదే రంగంలో ప్రవేశించింది. ఇలా జీవనం కొనసాగిస్తూ ఉండగా ఒక దర్శకనిర్మాత ఈమెను చూసి తమిళంలో ప్లేగర్ల్స్ అనే సాఫ్ట్ కోర్ చిత్రంలో అవకాశం కల్పిస్తే అక్కడి నుండి తిని ప్రస్థానం మొదలయ్యింది. ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథనాయికగా నటించింది.

తరువాత కిన్నెర తుంబికల్ అనే మలయాళ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయింది. దాదాపు 110 చిత్రాలలో నటించిన షకీలా మలయాళం, తమిళం, కన్నడ, హిందీ, తెలుగు భాషలలో నటించింది. నటించిన సినిమాలన్నీ దాదాపు బి గ్రేడ్ సాఫ్ట్ కోర్ సినిమాలు గానే చెప్పుకోవచ్చు. ఈమె తారాస్థాయిలో సినిమాలు తీసిన ఆ కాలంలో షకీలా సినిమా అనే పదం కన్నా ఎక్కువగా సాఫ్ట్ పోర్న్ సినిమాకు పర్యాయపదంగా చెప్పుకునేవారు.

ఇక అశ్లీల చిత్రాలకు పుల్ స్టాప్ పెడుతూ 2003 నుండి సినిమాలలో రాణించాలని సినిమా రంగం వైపు అడుగులు వేసింది. సినిమాలలో తన కళ్ళతో, రొమాంటిక్ గా కుర్రకారును హోరెత్తిస్తుంది. ఈమె నటించిన చిత్రాలు మంచి గుర్తింపు పొంది విజయం పొందాయి. ఒకప్పుడు హీరోయిన్లతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేదని ఇండస్ట్రీలో సమాచారం. ఇక ఈమె ఫైనాన్షియల్ బాధ్యతలు అన్ని తన అక్క నూర్జహాన్ చూసుకునేది.

తరువాత చివరికి అక్క మోసం చేయడంతో కోర్టుకెక్కింది. ప్రస్తుతం ఆమె వద్ద ఉన్న ఆస్తులు అన్ని పోయి సినిమా అవకాశాలు లేక చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈమెకు ఇంతవరకు పెళ్లి కాలేదు. బంధువులంతా ఈమెను డబ్బు కోసం మాత్రమే వాడుకొని వదిలేసినట్టు సమాచారం.