ఒకే ఒక్క మీటింగ్ .. టీడీపీ కి నిద్రలు లేని రాత్రులు మిగులుస్తోంది !

TDP

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తీరు ఏ ఎండకు ఆ గొడుగులా ఉంది. ఒకవైపు రాజకీయాల్లో వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరుకు ప్రతిపక్షం గుండెలు పగిలిపోతుంటే, జనం మాత్రం జైజైలు కొడుతున్నారు. అంతే కాకుండా కేంద్రంతో మంచి సంబందాలు నెరుపుతూ, మోదీగారితో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు ఏపీ సీయం జగన్.. ఈ దశలో బీజేపీతో పొత్తులు చెడిన చంద్రబాబుకు మాత్రం వైఎస్ జగన్ మోదీతో అలా రాసుకుపూసుకు తిరగడం, అందులో వైఎస్ జగన్ పాలనను మెచ్చుకుంటూ ప్రధాన మంత్రి మోదీ ప్రశంసించడంతో అసలే నిదురలేని రాత్రులు గడుపుతున్న బాబుకి ఈ ఘటనతో గొంతులో వెలక్కాయ పడ్డట్లుగా అయ్యిందట. ఒకవైపు సీయం పదవి లేక, మరో వైపు పచ్చని తోరణంలా కళకళలాడుతున్న టీడీపీ ఇప్పుడు వెలవెల పోతుండటంతో బాబుగారిలో ఒకటే టెన్షన్ మొదలైందట..

ఇకపోతే ఇదివరకు అన్నీ మరచి దగ్గరకు తీసిన మోదీతో చంద్రబాబు ప్రవర్తన బీజేపీని మాకు నచ్చినప్పుడు ప్రేమిస్తాం.. మా అవసరం తీరాకా ద్వేషిస్తాం.. రాష్ట్రానికివస్తే రాళ్లుకూడా వేయిస్తాం.. ఎక్కువ మాట్లాడితే ఏపీలో బీజేపీ నేతల విమానాన్ని కూడా దిగనివ్వం.. అన్నట్లుగా ఉండేది.. కానీ ప్రస్తుత పరిస్దితుల్లో మోదీ మంత్రాన్ని జపిస్తున్నారట బాబు.. ఇదిలా ఉండగా చంద్రబాబు విషయంలో నరాలు తెగిపోయి, ఆకలి మందగించి, రాత్రులు కాళరాత్రులుగా మిగిలే సంఘటన ఎదురైందట.

అదేమంటే జగన్ హస్తిన యాత్ర సక్సెస్ అయ్యిందని వైకాపా నేతలు చెబుతున్నారు. ఆ మాటలకు మరింత బలాన్ని చేకూర్చేలా, ప్రధాని మోదీ సైతం జగన్ ను ఆకాశానికెత్తేశారు.. పాలన అద్భుతం అన్నారు. సాక్షాత్తూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రే ఏపీలో వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అమిత్ షా కూడా జగన్ తో సానుకూలంగా చర్చలు జరిపారు. దీనికి తోడు వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ నేతలకు కడుపు రగులుతుందని ప్రచారం జరుగుతుంది.. మొత్తానికి ఈ ఒక్క మీటింగ్ చంద్రబాబులో చెత్త ఆలోచనలకు మూలం అయ్యిందట..