శృతిహాసన్ చేతి పై ఉన్న పచ్చబొట్టు వెనుక దాగి ఉన్న అర్థం ఇదేనా?

కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కూతురుగా మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సిద్ధార్థ హీరోగా నటించిన “అనగనగా ఒక ధీరుడు” సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ..అనివార్య కారణాల వల్ల కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైంది.

ఇటీవల రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వార మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో ఈ అమ్మడు బిజిగా ఉంది. ఇలా సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో సినిమా విశేషాలతో పాటు తన కుటుంబానికి, జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శృతిహాసన్ తన ప్రియుడితో కలిసి సోషల్ మీడియాలో అంతా ఇంతా కాదు. తరచూ తన అభిమానులు అడిగే ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెబుతూ ఉంటుంది.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో శృతిహాసన్ టాటూ గురించి అభిమాని అడగగా..తన చేయి పై ఉన్న టాటూ ఫోటో షేర్ చేసింది. అంతే కాకుండా ఆ టాటూ గురించి ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చింది. తన చేతి పై ఉన్నది రోజ్ టాటూ అంటూ చెప్పుకొచ్చింది. ఆ టాటూ చూడటానికి క్యాబేజ్ లా కనిపిస్తుంది.కానీ అది నిజానికి రోజ్ టాటూ. అది కనిపించాలంటే దానికి ప్రేమ కావాలి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణ కి జోడీగా నటిస్తోంది. ఇటీవలే అమ్మడు ఈ సినిమా షూటింగులో పాల్గొంది.