భూమా అఖిల ప్రియ- ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. ఇరువురి మధ్య పచ్చ గడ్డి వేస్తే! భగ్గుమనే స్థాయిలో వివాదాలున్నాయి. ఒకేపార్టీ అయినా వివాదం ముదిరిందంటే? బాహాబాహీకి సై అంటారు. సొంత పార్టీలోనే..సొంత నియోజక వర్గంలో నే కుమ్ములాటలు. ఇరువురి వివాదానికి పరిష్కారం చూపాలని ప్రయత్నించిన చంద్రబాబు నాయుడే చివరికి ఏమీ చేయలే నంటూ చేతులెత్తేసారు. నాటి నుంచి వివాదం మరింత పొడసాగింది. ఏవీ సుబ్బారెడ్డి పై భూమా అఖిల ప్రియ సుఫారీ ఇచ్చి హత్యాయత్నం చేయించడం అప్పట్లో రాష్ర్ట వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే.
ఈ నేపథ్యంలో అఖిల భర్తపై పోలీస్ కేసు నమోదవ్వడం సహా ఈ వ్యవహారం చాలా దూరమెళ్లింది . ఈ కేసులో కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సుబ్బారెడ్డి కూడా తగ్గేది లేదంటూ ఆళ్లగడ్డలోనే తేల్చుకుందామంటూ సవాల్ విసిరాడు. అటుపై సుబ్బారెడ్డి కుమార్తెను వెంట పెట్టుకుని వెళ్లి జిల్లా పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సుబ్బారెడ్డి వెనుక వైసీపీ కూడా ఉందని మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కించాయి. ఇలా సుబ్బారెడ్డి తీవ్రంగా ప్రతి ఘటించిన తర్వాత అఖిల ప్రియ దూకుడు తగ్గించింది. మాటకు మాట సమాధానం చెప్పడం తగ్గించారు.
సుబ్బారెడ్డి ఎటాక్..హత్యాయత్నం కేసు వెంటాడం..చంద్రబాబు సైలెంట్ గా ఉండటం వంటివి అఖిల ప్రియ మౌనానికి కొన్ని కారణాలుగా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అఖిల ప్రియ వైసీపీ లో చేరుతున్నారా? అన్న ప్రచారం సాగింది. అయితే ఆ పార్టీతో పొసగదనుకున్న అఖిల ప్రియ చివరికి కమలం గూటికి చేరుతున్నారని కూడా వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటికీ అఖిల ప్రియ టీడీపీని వదల్లేదు. ఆళ్లగడ్డ, నంద్యాల రాజకీయాలను శాషించిన భూమా ఫ్యామిలీ వారసురాలు ఇప్పుడు పూర్తిగా చల్లబడిపోయినట్లే కనిపిస్తోంది. గత రెండు నెలలుగా అంటే సరిగ్గా ఏవీ సుబ్బారెడ్డి పోలీసు ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేసిన దగ్గర నుంచి అఖిల ప్రియ సైలెంట్ గా ఉన్నారు. మీడియాకి..రాజకీయాలకు..టీడీ